ఆ దేశ ప్రజల శ్రేయస్సు కోసమే: భారత్‌పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్‌పై ప్రశంసలు కురిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. భారత విదేశాంగ విధానం ఉత్తమమైనదని, స్వతంత్రమైనదన్నారు. ప్రజల అభ్యున్నతి కోసమే భారత విదేశాంగ విధానం పనిచేస్తోందని ప్రశంసించారు ఇమ్రాన్ ఖాన్. ఖైబర్‌ పఖ్తూంక్వాలోని మలాకండ్ ప్రాంతంలో బహిరంగ సభలో ఇమ్రాన్‌ ఖాన్ పాల్గొని ప్రసంగించారు.

Recommended Video

    India's Foreign Policy ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది - Imran Khan | Oneindia Telugu

    ఐరోపా సమాఖ్య దేశాల రాయబారుల కోసం చెబుతున్నాను వినండి. ఏ రాయబారికి ఒక దేశ విదేశాంగ విధానంపై బహిరంగంగా మాట్లాడే హక్కు లేదు. ఐరోపా సమాఖ్య రాయబారులు రష్యాపై నిషేధం విధించాలని పాకిస్థాన్​ను కోరారు. మీరు భారత్‌ను కూడా ఇలానే అడగగలరా? అని నేను వారితో అన్నాను. భారత్‌తో ఇదే మాట అంటే వారి పరువు పోతుంది. మేము(పాకిస్థాన్) వారికి(ఐరోపా దేశాలకు) ఏమన్నా బానిసలమా? పాకిస్థాన్ విదేశాంగ విధానం ప్రజల మేలు కోసం ఉండాలి. మన పొరుగుదేశం భారత్‌ను చూడండి. నేను భారతదేశాన్ని మెచ్చుకుంటాను. వాళ్ల(భారత) విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది. హిందుస్థాన్​ వారితో కలిసి కూటమిగా ఉంది. క్వాడ్‌లో అమెరికా, భారత్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. అయినా సరే ఉక్రెయిన్ వ్యవహారంలో తటస్థంగా ఉన్నామని భారత్ చెబుతోంది. రష్యాపై ఆంక్షలు ఉన్నా సరే ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఎందుకంటే భారత విదేశాంగ విధానం ఆ దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఉంటుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

     For betterment of people: Pakistan PM Imran Khan lauds India for its foreign policy

    అమెరికా ఉన్న క్వాడ్ కూటమిలో సభ్యత్వం కలిగిన భారత్ ఉక్రెయిన్ అంశంలో తటస్థంగా ఉన్నామని చెబుతోందని పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్. రష్యాపై ఆంక్షలు ఉన్న సమయంలోనూ ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందని అన్నారు. ఎందుకంటే భారత విదేశాంగ విధానం ఎల్లవేళలా ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని ప్రశంసించారు.

    ఇది ఇలావుండగా, ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 28న ఓటింగ్‌ జరగనుంది. ఈ అవిశ్వాస తీర్మానానికి ఇమ్రాన్‌ సొంత పార్టీ ఎంపీలు కొందరు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై విమర్శలు గుప్పించిన పాక్ ప్రధానమంత్రి వారు తమ మ‌న‌స్సాక్షిని అమ్ముకున్నార‌ని పాకిస్థాన్ ప్రజ‌ల‌కు అర్థమైంద‌న్నారు. వారి పేర్ల ముందు శాశ్వతంగా దేశ‌ద్రోహి అన్న ప‌దం మిగిలిపోతుంద‌ని ఘాటు విమ‌ర్శలు చేశారు. పాక్ ఆర్మీ కూడా ఇమ్రాన్ రాజీనామాను ఆశిస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+