వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సమస్య లేదు.. ఒక్క జపాన్‌లో తప్ప: ఏంటది?

దీన్నిబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతీ 100మందికి 148ఉద్యోగాలు ఉన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం గత 40ఏళ్లలో జపాన్.. ఎన్నడూ లేనంత ఉపాధి కొరతను ఎదుర్కొంటోంది.

|
Google Oneindia TeluguNews

టోక్యో: ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థయినా మానవ నైపుణ్యం కొరవడితే కుప్పకూలడం ఖాయం. ప్రస్తుతం జపాన్ కూడా మానవ వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలన్ని ఉపాధి కొరతను ఎదుర్కొంటుంటే.. జపాన్‌లో మాత్రం కావాల్సినన్ని ఉద్యోగాలున్నా.. అందులో చేరేవారు కరువయ్యారు. కారణం.. అందుకు తగిన రీతిలో మానవ వనరులు లేకపోవడమే.

జపాన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. అక్కడ ఒక్కో దరఖాస్తుదారుని కోసం 1.48లక్షల ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయి. మార్చిలో ఆ సంఖ్య 1.45లక్షలుగా ఉండగా.. ఏప్రిల్ లో మరింత పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. దీన్నిబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతీ 100మందికి 148ఉద్యోగాలు ఉన్నాయి. కానీ అందులో చేరేవారు మాత్రం కేవలం 67మంది మాత్రమే ఉన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం గత 40ఏళ్లలో జపాన్.. ఎన్నడూ లేనంత ఉపాధి కొరతను ఎదుర్కొంటోంది.

For Every 100 Jobs, There Are Only 67 Candidates In Japan

జపాన్ లో 1994నుంచి చాలాకాలంగా నిరుద్యోగుల రేటు స్థిరంగా 2.8శాతం వద్దే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జపాన్ ఆర్థిక వృద్ధి కూడా గరిష్ట స్థాయిలో పెరిగింది. ప్రైవేట్ వినియోగం, ఎగుమతులు పెరగడంతో ఇది సాధ్యపడింది. అయితే దేశీయంగా మాత్రం వినియోగదారుల వ్యయాలు బలహీనంగానే ఉండటం గమనార్హం.

2015తర్వాత తొలిసారి జపాన్ బెంచ్ మార్క్ స్టాక్ మార్కెట్ సూచీ నిక్కీ కూడా 20వేల పాయింట్ మార్కును చేధించింది. శ్రామిక కొరత కారణంగా వేతనాల పెంపు కూడా పెరుగుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

English summary
Japan, the world's third biggest economy, can't find enough workers. According to government data released for the month of April, Japan now has 1.48 jobs for every applicant, up from 1.45 in March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X