బెంగళూరు క్లబ్‌కు బాకీ పడిన బ్రిటన్ మాజీ ప్రధాని
లండన్: రాజకీయ నాయకులు, సినీరంగానికి చెందిన వారు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఆదాయపు పన్ను చెల్లించకుండా ప్రభుత్వాలను మోసం చేయ్యడం, మంత్రులు, శాసన సభ్యులు నీటి బిల్లు, విద్యుత్ బిల్లు చెల్లించలేదని ఎన్నో సార్లు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే బ్రిటన్ మాజీ ప్రధాని అప్పు ఉన్నాడనే లెక్కలు భారతదేశంలో భద్రంగా ఉన్నాయని వెలుగు చూసింది.
బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ బెంగళూరు క్లబ్ కు బాకీ పడ్డారని లెక్కలు ఉన్నాయని వెలుగు చూసింది. బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ చెల్లించ వలసిన మొత్తం అక్షరాల 13 రూపాయలు అని క్లబ్ అప్పుల జాబితాలో పోందుపరిచారని బీబీసీ వెల్లడించింది.
ఈ విషయాని బీబీసీ న్యూస్ ప్రసారం చేసింది. చర్చిల్ బెంగళూరు వచ్చిన సమయంలో ఆయన బెంగళూరు క్లబ్ లో బస చేశారు. బెంగళూరు సిటి క్లబ్ ఖాళీ చేసి వెళ్లే సమయంలో చర్చిల్ రూ. 13 బిల్లు చెల్లించలేదని బీబీసీ స్పష్టం చేసింది.

బెంగళూరు క్లబ్ లో ఇప్పటి వరకు 17 మంది బాకీ చెల్లించవలసి ఉంది. ఆ 17 మందిలో బ్రిటన్ మాజీ ప్రధాని ఒకరు. 1899లో చర్చిల్ బెంగళూరు క్లబ్ లో ఉన్నారని రికార్డులు ఉన్నాయి. 1896లో చర్చిల్ ఒక సైన్యాధికారి. ఆ సమయంలో ఆయన బెంగళూరు వచ్చారు. మూడు సంవత్సరాల పాటు బ్రిటీష్ సైన్యాధికారిగా ఉన్నారు. తరువాత బెంగళూరు క్లబ్ ఖాళీ చేసి ఇంగ్లాండ్ వెళ్లిపోయారు.
1868లో కొందరు బ్రిటీష్ దేశస్తులు బెంగళూరు క్లబ్ ఏర్పాటు చేశారు. భారతదేశంలోని ప్రసిద్ది చెందిన క్లబ్ లలో బెంగళూరు క్లబ్ మొదటి వరసలో ఉంది. అంతటి చరిత్ర కలిగిన బెంగళూరు క్లబ్‌కు ఒక దేశానికి చెందిన మాజీ ప్రధాని బాకీ పడ్డారని బీబీసీ ప్రచారం చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications