రేపిస్ట్ పోలీస్ అధికారికి 263 ఏళ్ల జైలు శిక్ష, హ్యాపీ బర్త్ డే పాడారు
ఒక్లహామా: అమెరికాలో తెల్ల జాతీయుడైన డేనియల్ అనే 29 ఏళ్ల మాజీ పోలీస్ అధికారికి న్యాయస్థానం 263 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని పైన అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అవి రుజువు కావడంతో కోర్టు ఆ శిక్షను విధించింది.
డేనియల్ పైన 36 అత్యాచార కేసులు ఉండగా, 18 నిర్ధారణ అయ్యాయి. డ్యూటీలో ఉండగా మొత్తం దమూడి మంది నల్లజాతి మహిళలను ఇతడు లైంగికంగా వేధించాడు. వారి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో పదమూడేళ్ల చిన్నారి, ఓ వృద్ధురాలు కూడా ఉన్నారు.

తీర్పు వెలువడిన రోజే డేనియర్ పుట్టిన రోజు. దీంతో డేనియల్‌కు శిక్ష పడగానే అతడి బాధితులందా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... హ్యాపీ బర్త్ డే అంటూ పాట అందుకున్నారు. వివిధ రేప్ ఛార్జీల పైన అతనికి కోర్టు రెండు వందల అరవై మూడేళ్ల శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications