Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10వేలమందితో సెక్స్‌లో పాల్కొన్నా: మాజీ సెక్స్‌వర్కర్

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మాజీ సెక్స్ వర్కర్ ఒకరు తన గురించి సంచలన విషయాలు చెప్పింది. గినెత్ మాంటెనిగ్రో అనే ఈ మాజీ సెక్స్ వర్కర్ 'టెన్ థౌజండ్ మెన్ అండ్ కౌంటింగ్' అనే పుస్తకాన్ని రాసింది. అందులో ఆమె పలు ఆసక్తికరమై విషయాలను రాసింది. తాను పదివేల మందికి పైగా పడక సుఖాన్ని ఇచ్చినట్లు చెప్పింది.

ఆమె మొత్తం 10,091 మందికి పడక సుఖం ఇచ్చిందట. తన కెరీర్ బాగా ఉన్న సమయంలో ఆమె గంటకు ఒక్కో కస్టమర్ వద్ద 500 నుండి 1,000 డాలర్ల వరకు తీసుకున్నానని చెప్పింది. ఆమె సెక్స్ వర్కర్‌గా దాదాపు పదిహేనేళ్లు ఉంది. రిటైర్ అయి మూడేళ్లు అవుతోంది.

Former escort tells all in new book

సెక్స్ వర్కర్‌గా ఉన్న సమయంలో డ్రగ్స్, అల్కాహాల్‌కు బానిస అయినట్లు చెప్పింది. ఆమె ఆస్ట్రేలియా దేశంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు సైతం వెళ్లింది. ఆమె వయస్సు ప్రస్తుతం 36 ఏళ్లు. ఇప్పుడు ఆమె మెల్‌బోర్న్‌లో బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్‌గా ఉంది.

సెక్స్ వర్కర్‌గా తన జీవితం ఎలా ఉండేదో పూస్తకంలో తెలిపింది. నిత్యం వేల డాలర్లు, కొత్త కొత్త కార్లు, బట్టలు ఉపయోగించినట్లు చెప్పింది. తనకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తాను గ్యాంగ్ రేప్‌కు గురైనట్లు పుస్తకంలో ఆమె వెల్లడించింది. విలువలు కలిగిన ఓ కుటుంబంలో పుట్టినట్లు తెలిపింది.

బతుకుదెరువు కోసం బార్లు, పబ్బుల్లో డ్యాన్సింగ్ గాళ్‌గా పని చేశానని, 21 ఏళ్ళ వయసులో ఎస్కార్ట్ గాళ్‌గా ప్రస్థానం మొదలైందని వివరించింది. 29 ఏళ్ళ వయసప్పుడు కమర్షియల్ పైలెట్‌గానూ విమానాలు నడిపిందట. సెక్స్ వర్కర్‌గా మొదటిసారే వెయ్యి డాలర్లు అందుకోవడం, తొలిసారి మందుకొట్టిన అనుభవం ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం తాను ఓ పారిశ్రామికవేత్తతో కలిసి ఉంటున్నానని, పాత జీవితానికి గుడ్‌బై చెప్పానని చెప్పుకొచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+