‘‘అమ్మో! వాళ్ల చేతికి చిక్కితే.. భూమ్మీదే నరకం, మూడేళ్లుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ’’
ఐసిస్ ఉగ్రమూకల బారి నుంచి తప్పించుకొని దాదాపు మూడేళ్ల తర్వాత ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సొంత ఇంటికి చేరిందో ఇరాకీ యువతి. అక్కడ ఆమె ఎదుర్కొన్న దారుణ పరిస్థితులను వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది.
ఇరాక్: ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండాల్సిన అమ్మాయిలను ఉన్నపళాన ఎత్తుకెళ్లి అమ్మేస్తారు.. కొందరిని బానిసలుగా చేసుకుంటారు.. వారి మాట వినకపోతే దారుణంగా చిత్రహింసలు పెడతారు.. ఎదురు తిరిగితే కర్కశంగా చంపేస్తారు.
ఇదీ ఐసిస్ ఉగ్రమూకల చేతికి చిక్కిన ఆడవాళ్ల పరిస్థితి. వారి బారి నుంచి తప్పించుకొని దాదాపు మూడేళ్ల తర్వాత ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సొంత ఇంటికి చేరిందో ఇరాకీ యువతి. అక్కడ ఆమె ఎదుర్కొన్న దారుణ పరిస్థితులను వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది.

అనుకోకుండా ఒకరోజు...
నదియా మురాద్.. ఉత్తర ఇరాక్‌లోని యాజిదీ గ్రామ యువతి. అనుకోకుండా ఓ ఉపద్రవం ఆ అమ్మాయి జీవితాన్ని కుదిపేసింది. ఐసిస్ ఉగ్రవాదుల చేతికి చిక్కి ఆమె పడిన నరకయాతనను ఐక్యరాజ్యసమితి వేదికగా కన్నీటిధారలతో చెప్పుకొచ్చిందిలా..

ఏం జరుగుతుందో తెలిసే లోపే...
2014లో మా ప్రాంతాన్ని ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో తెలిసే లోపు ఆడవాళ్లని, మగవాళ్లని వేరుచేసి నిలబెట్టారు. పురుషులందరినీ కర్కశంగా చంపేశారు. మమ్మల్ని కూడా చంపేస్తారకున్నా. కానీ అమ్మేశారు.

వేలాది మంది బానిసలుగా...
సిరియన్లు, ఇరాకీయులు, ట్యూనిషియన్లు, యూరోపియన్లు మాపై అత్యాచారం చేసేవాళ్లు. నాలాగే దాదాపు 3 వేల మంది యాజిదీ వర్గానికి చెందిన యువతులు, మహిళలను ఎత్తుకెళ్లి బానిసలను చేశారు.

యాజిదీ మహిళల హక్కుల కోసం...
ఐసిస్ ఉగ్రవాదుల బారి నుంచి 2014 నవంబరులో మురాద్ తప్పించుకుంది. 24ఏళ్ల మురాద్ ప్రస్తుతం యాజిదీ మహిళల హక్కుల కోసం పోరాడుతోంది. ఆమె పోరాటాన్ని గుర్తించిన యూరోపియన్ పార్లమెంటు సఖరోవ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. 2015లో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ వేదికగా తాను ఎదుర్కొన్న నరకాన్ని వివరించింది నదియా మురాద్.

మూడేళ్ల తరువాత మళ్లీ...
ఆమెతో పాటు 19 ఏళ్ల లమియా అజి బషర్ కూడా ఐసిస్ దురాగతాలకు బాధితురాలు. ఒకసారి వారి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా బషర్‌ను ల్యాండ్‌మైన్‌తో పేల్చి చంపేసేందుకు కూడా వెనకాడలేదా ఉగ్రమూక. ఈ ప్రమాదంలో ఆమె ఒక కన్ను కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయపడింది. ఇక మురాద్ అయితే.. ఆమెను ఎక్కడైతే వారు అపహరించుకుపోయారో అదే ప్రాంతానికి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత చేరుకుంది.












Click it and Unblock the Notifications