Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ ప్రధానిపై కాల్పులు: నారా నగరంలో ఘటన: ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తోండగా

టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బుల్లెట్ గాయాలతో రక్తమోడుతూ కనిపించారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నారా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే ఆయన వేదిక మీదే కుప్పకూలిపోయారు.

రక్తపుమడుగులో పడిఉన్న ఆయనను భద్రత సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రసంగం ప్రారంభించిన వెంటనే కాల్పులు జరిపిన శబ్దం వినిపించిందని, ఆ వెంటనే షింజో వేదిక మీద కుప్పకూలిపోయినట్లు స్థానిక ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ఈ విషయాన్ని ది జపాన్ టైమ్స్ ధృవీకరించింది. అనారోగ్య కారణాలతో ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. స్వచ్చందంగా వైదొలిగారు.

 Former Japanese PM Shinzo Abe shot in the city of Nara.

ఎగువసభ కోసం ప్రస్తుతం జపాన్‌లో ఎన్నికలను నిర్వహిస్తోన్నారు. ఎల్లుండి పోలింగ్. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నారా సిటీలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 11:30 గంటలకు నారా సిటీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. వెనుక వైపు నుంచి దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.

బుల్లెట్ తగిలిన వెంటనే ఆయన అక్కడే కుప్పకూలారు. ఆ వెంటనే గుండెపోటు కూడా సంభవించింది. మెడికల్ ఎమర్జెన్సీ హెలికాప్టర్‌లో ఆయనను కషిహర సిటీలోని నారా మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని, అత్యవసరంగా అత్యాధునిక వైద్య చికిత్సను అందజేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనతో ఎన్నికల ప్రచారాన్ని అప్పటికప్పుడు నిలిపివేశామని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+