వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

93ఏళ్ళలో చనిపోయిన మతబోధకుడు,ఆయనకు 130మంది భార్యలు..

వివాదాస్పద మతబోధకుడు మొహమ్మద్ బెలో అబూబకర్ అంతుచిక్కని వ్యాధితో కన్నుమూశారు. అబూబకర్ కు 92 ఏళ్ళు. ఆయనకు 130 మంది భార్యలు.203 మంది సంతానం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అబూజా: వివాదాస్పద మతబోధకుడు మొహమ్మద్ బెలో అబూబకర్ అంతుచిక్కని వ్యాధితో కన్నుమూశారు. అబూబకర్ కు 92 ఏళ్ళు. ఆయనకు 130 మంది భార్యలు.203 మంది సంతానం.

నైజీరియాలోని బిడా రాష్ట్రంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన సహయకులు ఆదివారం నాడు మీడియాకు తెలిపారు.

స్థానికులు ఆయనను బాబా గా వ్యవహరిస్తారు. అబూ బకర్ పవిత్ర గ్రంథానికి వింత బాష్యాలు చెప్పడంతో పాపులరయ్యాడు. ఒక పురుషుడు, ఎంతమంది స్త్రీలను వివాహం చేసుకోవచ్చనేది ఆయన వాదన.

former muslim preacher with 130 wives dies at 93

ఆ క్రమంలోనే ఆయన 130 మంది మహిళలను పెళ్లాడాడు. బకర్ ద్వారా వారికి 203 మంది సంతానం కలిగింది. రెండంతస్థుల భారీ భవనంలో ఆయన తన కుటుంబంతో నివసించేవాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా రికార్డులకెక్కింది అబూబకర్ కుటుంబం.ఆయన మరణించేనాటికి ఆయన భార్యల్లో కొందరు గర్భవతులుగా ఉన్నారు.
2008 లో రెండుగంటల వ్యవధిలోనే ఆయన 82 మంది భార్యలకు విడాకులు ఇచ్చారు. ఈ విడాకుల ఘటన కూడ సంచలనంగా మారింది.

అయితే భగవంతుడి ఆదేశాలను పాటించేందుకే తాను జన్మించానని బకర్ పలుమార్లు చెప్పుకొన్నాడు. చనిపోవడానికి కొద్దిరోజుల ముందే దేవుడు అప్పగించిన పని ముగిసిందని ఆయన తన అనుచరులకు చెప్పాడు.

English summary
A former muslim preacher, who rose to fame in nigeria for marrying more than 100 women, has died at the age of 93, media reports said. mohammed Bello abubakar died from an unknown illness on Saturday in bida of niger state and large crowds turned out for his funeral on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X