ప్లేబాయ్ మాజీ మోడల్ మెక్ డౌగల్‌తో ట్రంప్ ఎఫైర్: ఆ ఒప్పందాన్ని విముక్తి ప్రసాదించాలని కోర్టుకు
న్యూయార్క్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోర్న్‌సార్ట్ డానియేల్‌తో వివాహేతర సంబంధం ఉందని ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే తాజాగా మరో ఎఫైర్ వెలుగు చూసింది. ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దావా వేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రియల్ ఏస్టేట్ వ్యాపారిగా అత్యంత సంపన్నుడిగా ట్రంప్‌కు పేరుంది. అమెరికా అధ్యక్షుడిగా కాక ముందు ట్రంప్ పలువురితో రాసలీలలను కొనసాగించినట్టుగా బయటకు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న సమయంలో ఫోర్న్‌స్టార్ డానియెల్‌తో తనకున్న సంబంధం బట్టబయలు కాకుండా ఉండేందుకు ఆయన ఆమెతో ఒప్పందం కూడ చేసుకొన్నారని వెలుగు చూసింది. అయితే తాజాగా మరో ప్లేబాయ్ మోడల్ తనకు ట్రంప్‌తో సంబంధాలున్నాయని కోర్టును ఆశ్రయించడం కలకలం రేపుతోంది.

ట్రంప్‌తో సంబంధాలున్నాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు ఎఫైర్ ఉందని ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్ లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో దావా వేశారు. ఈ విషయమై నోరు మెదపకుండా ఉండేందుకు గాను చేసుకొన్న ఒప్పందం నుండి తనకు విముక్తిని కల్పించాలని కోరుతూ ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్ డౌగల్ కోర్టును ఆశ్రయించారు .

లక్లా 50వేల డాలర్లు చెల్లింపు
ట్రంప్‌తో తనకున్న ఎఫైర్ గురించి బయటకు వెల్లడించకుండా ఉండేందుకు గాను నేషనల్ ఎంక్వైరర్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అమెరికన్ మీడియా ఇంక్ 2016లో తనకు లక్షా50వేల డాలర్లు చెల్లించిందని ఆమె తన దావాలో పేర్కొన్నారు. ఈ మీడియా సంస్థ అధిపతి డేవిడ్ పెకర్ గతంలో ట్రంప్ తన వ్యక్తిగత స్నేహితుడని ప్రకటించారు.

ట్రంప్ ఎఫైర్ గురించి అమెరికన్ మీడియా సంస్థ కొనుగోలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెక్‌డౌగల్ ఎపైర్ గురించి కథనాన్ని ప్రచురించే హక్కులను ఆమె నుండి అమెరికన్ మీడియా సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు ఈ ఎఫైర్ గురించి కథనాలు రాలేదు. ఈ విషయమై న్యూయార్కర్ మేగజైన్ గత మాసంలో ప్రకటించింది. ఈ తరుణంలోనే మెక్ డౌగల్ ట్రంప్‌పై దావా వేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

10 నెలల పాటు ట్రంప్‌తో సంబంధాలు
2006-07లో సుమారు 10 మాసాల పాటు ట్రంప్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని మెక్‌డౌగల్ తన దావాలో పేర్కొన్నారు. ఇదే సమయంలో ఫోర్న్‌స్టార్‌తో కూడ డేనియల్‌తో కూడ ట్రంప్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా గర్భవతిగా ఉంది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ పోర్న్ స్టార్ డానియేల్ తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడు. ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ తనతో రహస్యంగా సంప్రదింపులు జరిపారని మెక్ డౌగల్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications