ఇంట్లో జారి పడ్డ జార్జి బుష్: నిలకడగానే ఆరోగ్యం
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్.డబ్ల్యు బుష్ బుధవారం తన ఇంట్లో ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ ఎముక విరిగిపోయింది. దీంతో ఆయన్ని పోర్ట్ లాండ్ మెయిన్ మెడికల్ ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. జార్జి బుష్ అమెరికా 41వ దేశాధ్యక్షుడిగా (1989-1993) పని చేశారు.
41 fell at home in Maine today and broke a bone in his neck. His condition is stable -- he is fine -- but he'll be in a neck brace.
— Jim McGrath (@jgm41) July 16, 2015 గత నెలలోనే జార్జి బుష్ 91వ పడిలోకి అడుగుపెట్టారు. 2014లో కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో జార్జి బుష్ ఆసుపత్రిలో చేరారు. గత వారంలో జార్జి బుష్ అతని భార్య ఇద్దరూ సంయుక్తంగా అధ్యక్ష ఎన్నికల కోసం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సీనియర్ జార్జి బుష్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆయన కుమారుడు జూనియర్ జార్జి బుష్ కూడా అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు.












Click it and Unblock the Notifications