12వేల మంది మహిళలతో శృంగారం: పట్టుబడ్డ మాజీ ప్రిన్సిపాల్
టోక్యో: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ పాఠశాల మాజీ ప్రిన్సిపాల్ తన వికృత చేష్టలతో కటకటాలపాలయ్యాడు. అతడు ఏకంగా 12వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొనడం గమనార్హం. వాళ్ళందరికి డబ్బులిచ్చి వారితో శృంగారం చేశాడట.
అయితే అతని బండారం ఇటీవలే బట్టబయలైంది. మనీలాకు చెందిన ఓ 14ఏళ్ల అమ్మాయితో శృంగరాంలో పాల్గొంటూ దొరికిపోయాడు. దీంతో అతడ్ని జపాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలిప్పీన్స్‌లో ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఈ ప్రబుద్ధుడు 12వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ కామాంధుడి పేరు యుహీ తకషిమా. అతని వయస్సు 64ఏళ్లు.

గత 27ఏళ్ల కాలంలో తాను మాయమాటలు చెప్పి లక్షా50వేల మంది మహిళలతో ఫొటోలు దిగాడు. అంతేగాక, సేకరించిన మహిళల ఫొటోలతో 400 ఆల్బమ్స్ కూడా తయారు చేసి భద్రపర్చినట్లు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు.
తన తీపి జ్ఞాపకాలకు గుర్తుగానే ఫొటోలను భద్రపరిచినట్లు పోలీసులకు వెల్లడించాడు. 1988 నుంచి డబ్బులు చెల్లిస్తూ మహిళలతో శృంగారం జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 14 ఏళ్ల నుంచి 70ఏళ్ల మధ్య వయస్కులైన 12వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపాడు.












Click it and Unblock the Notifications