Vivek Ramaswamy: వివేక్ రామస్వామిని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్.. ఎందుకో తెలుసా..!
ఇటీవలి రిపబ్లికన్ ప్రైమరీ పోల్ లో భాగంగా సీబీఎస్ యూగౌలో బాగా పనిచేసినందుకు భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. వివేక్ రామస్వామి 2024 అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు రామస్వామి గురించి తెలుసని ట్రంప్ అన్నారు. రామస్వామి మంచి వ్యక్తి అని అన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో తనకు ప్రత్యర్థి అయిన వివేక్‌ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తడం చర్ఛనీయంశంగా మారింది.
"ఇటీవలి రిపబ్లికన్ ప్రైమరీ పోల్, CBS YouGovలో వివేక్ రామస్వామి బాగా రాణిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో రాశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ తో పాటు పలువురు పోటీలో ఉన్నారు. వీరిపై CBS YouGov ఓ పోల్ సర్వే చేపట్టింది. ఇందులో అధ్యక్ష అభ్యర్థి రేసులో అందరికంటే ట్రంప్ ముందంజలో ఉండగా.. ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ రెండో స్థానంలో నిలిచారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో సమానంగా వివేక్ రామస్వామి మూడో స్థానంలో నిలిచారు.

వివేక్ రామస్వామి అమెరికాలోని ఒహాయోలో 1985 ఆగస్టు 9న జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికాకు వలస వచ్చారు. వివేక్ తల్లి వృద్ధాప్య మానసిక వైద్యురాలు కాగా తండ్రి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజనీర్‌గా పనిచేశారు. వివేక్ రామస్వామి హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. ఆయన ఔషధరంగంలో పని చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది.












Click it and Unblock the Notifications