పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి
ఇస్లామాబాద్‌లో జరగనున్న ఇరాన్ కాల్పుల విరమణ చర్చల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ భద్రతా చర్యలను అంచనా వేయడానికి 30 మంది సభ్యుల అమెరికా అడ్వాన్స్ బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అమెరికా ప్రతినిధుల బృందానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది. సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ స్పష్టం చేసింది.
అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్‌కోవ్, జేర్డ్ కుష్నర్ సహా ముగ్గురు కీలక ప్రతినిధులు ఈ కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొంటారు. అలాగే ఇరాన్ నుండి ఆ దేశ స్పీకర్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దీనికి హాజరవుతారు. వారు ఇప్పటికే ఇస్లామాబాద్ కు చేరుకున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. శనివారం చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల సన్నాహకాలపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నక్వీ, అమెరికా ఛార్జ్ డి ఎఫైర్స్ నటాలీ బేకర్ తో భేటీ అయ్యారు.

ఈ పరిణామాల మధ్య వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రెటరీ అరీ ఫ్లెచర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతపరమైన హెచ్చరికలను జారీ చేశారు. పాకిస్థాన్‌కు వెళ్లే అమెరికన్ ప్రతినిధులు, ప్రత్యేకించి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భద్రతపై ఆందోళనలు ఉన్నాయని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆయుధాలతో నిండిన, అత్యంత ప్రమాదకరమైన దేశమని పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లేదని తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌లో ఉన్నత స్థాయి పర్యటనలు ఎల్లప్పుడూ ప్రమాదకరంగానే ఉన్నాయని గుర్తుచేశారు.
బిల్ క్లింటన్ తన పర్యటనలో తన ఆచూకీ బయటపడకుండా ఉండేందుకు డెకాయ్ ఎయిర్‌క్రాఫ్ట్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని, రహస్యంగా విమానాలను మార్చారని ఫ్లెచర్ వివరించారు. 2006లో జార్జ్ బుష్ పాకిస్థాన్ పర్యటనను అమెరికన్ సీక్రెట్ సర్వీస్ వ్యతిరేకించిందని పేర్కొన్నారు. తాజా మిషన్ అమెరికన్ సీక్రెట్ సర్వీస్, సైనిక భద్రతకు పెద్ద పరీక్షగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జేడీ వాన్స్, ఇతర ప్రతినిధులు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేయాలని సూచించారు.
ఆ దేశం అస్థిరంగా, ప్రమాదకరంగా ఉండటమే కాకుండా, ప్రభుత్వం పూర్తి నియంత్రణలో లేకపోవడం ఈ భయాలకు ప్రధాన కారణాలని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో ఉన్నత స్థాయి పర్యటనలు అతి తక్కువ వ్యవధిలోనే ముగిశాయని అన్నారు. సుదీర్ఘకాలం పాటు తమ దేశ ప్రతినిధులు ఇస్లామాబాద్ లో ఉండటం భద్రతపరంగా ఆందోళనకరమేనని ఫ్లెచర్ చెప్పారు. ఉపాధ్యక్షుడితో సహా మన ప్రతినిధులందరూ సురక్షితంగా తిరిగి రావాలని, చర్చలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
-
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్ -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్ - ఈ రెండిట్లో ఏది మంచిది..!? -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
కోడిగుడ్డు అక్షరాల రూ.25 వేలు..? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..!












Click it and Unblock the Notifications