హాలోవీన్ పార్టీలో కాల్పులకు తెగబడ్డ ఉన్మాది: నలుగురు మృతి, పలువురికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగర సమీపంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు. గురువారం రాత్రి ఓరిండా పట్టణంలో హాలోవీన్ నైట్ పార్టీ జరుగుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా కథనాలను వెలువరించింది.

ఓరిండాలో జరిగిన దాడిలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని స్థానిక పోలీసులు శుక్రవారం ఉదయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దుండగుడు రాత్రి 10.45 గంటల ప్రాంతంలో తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

Four killed, four others wounded at Halloween party shooting in San Francisco Bay Area

ఓ పెద్ద అద్దె ఇంటి ముందు జరుగుతున్న హాలోవీన్ పార్టీ దాదాపు 100 మందికిపైగా పాల్గొన్నారని.. అయితే కాల్పులకు తెగబడిన ఆ ఉన్మాది ఎవరనేది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇది ఇలావుంటే, మంగళవారం లాస్ఏంజెల్స్‌లో జరిగిన హాలోవీన్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లోనూ ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

ఇటీవల కాలంలో అమెరికాలో ఇలాంటి ఉన్మాదులు కాల్పులకు తెగబడిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. సమూహాలు చేరిన సందర్భాల్లోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+