పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో కత్తిపోట్లు, నలుగురు మృతి, ఎదురుకాల్పుల్లో నిందితుడి హతం
ప్యారిస్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఓ ఉద్యోగి రెచ్చిపోయాడు. ఏమైందో తెలియదు కానీ కత్తితో విచక్షణరహితంగా దాడిచేశాడు. దాడిలో నలుగురు పోలీసులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కత్తితో దాడిచేసిన వ్యక్తిని పోలీసులు షూట్ చేశారు. ప్యారిస్ పోలీసు ప్రధాన కార్యాలయంలో తుపాకుల మోత కలకలం రేపింది.
పోలీసు అధికారులపై దాడి చేసిన వ్యక్తి కూడా హెడ్ క్వార్టర్స్‌లోని పనిచేస్తున్నట్టు గుర్తించారు. అతనిని పై అధికారులు ఇబ్బందికి గురిచయేడంతో దాడి చేశారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. తన పై అధికారులపై ఓ వ్యక్తి దాడి చేయడం, దాదాపు నలుగురు చనిపోవడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతను మరింత మందిపై దాడిచేస్తారెమోనని కాల్చి చంపారు. ఆ తర్వాత పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు జరిపారు. ఘటనాస్థలానికి పదుల సంఖ్యలో అత్యవసర వాహనాలు తరలివచ్చాయి.

పోలీసు హెడ్ క్వార్టర్ సమీపంలో ఉన్న విస్నిటీ అనే మెట్రో స్టేషన్ గుండా మెట్రో రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. పోలీసు అధికారులపై కాల్పులు జరిపిన వ్యక్తి ఏ విభాగంలో పనిచేస్తున్నారనే అంశంపై క్లారిటీ రాలేదు. కత్తిపోట్ల తర్వాత పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో అత్యవసర సమాచారాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా అందజేశారు. ప్యారిస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కత్తి పోట్లతో ఆ దేశ విదేశాంగ మంత్రి క్రిస్టోప్ తన టర్కీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. నిందితుడు దాడి ఎందుకు చేశాడనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications