తల్లి చూస్తుండగానే కూతురు తలనరికేశాడు(వీడియో)

తైపీ: తైవాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి.. కన్నతల్లి కళ్లెదుటే కత్తితో దాడి చేసి అభంశుభం తెలియని ఓ చిన్నారి తల నరికివేశాడు. సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు నిందితుడ్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అతడ్ని అరెస్ట్ చేశారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తైపీలో సోమవారం ఉదయం మెట్రో స్టేషన్‌కు ఓ తల్లీ, తన నాలుగేళ్ల కూతురు కలిసి వెళ్తున్నారు. బాలిక చిన్న సైకిల్ తొక్కుకుంటూ వస్తోంది. ఇంతలోనే ఓ గుర్తుతెలియని దుండగుడు వారిద్దరిని ఫాలో అయ్యాడు. కొంతసేపటి తర్వాత ఆ దుండగుడు తమను సమీపించాడని బాలిక తల్లి తెలిపింది.

Four-year-old girl beheaded in Taiwan knife attack

ఆ సమయంలో తన కూతురు సైకిల్ నడుపుందని చెప్పిన ఆమె.. ఆ వ్యక్తి తన బేబీకి సహాయం చేయడానికి వస్తున్నాడని భావించినట్లు తెలిపింది. అయితే, బాలిక వద్దకు చేరిన వెంటనే నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో చిన్నారిపై దాడికి దిగాడు.

తాను ఎంత వారిస్తున్నా వినకుండా దుండగుడు చిన్నారిపై కత్తితో అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అతడ్ని లాగేందుక చాలా ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని చెప్పింది.

చుట్టుపక్కల ఉన్న కొందరు అక్కడికి చేరుకునే లోగానే ఆ చిన్నారి తల నరికివేసి అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు నిందితుడు. దీంతో వారు ఆ దుండగుడిని పట్టుకుని చితకబాదారు. వారి నుంచి పోలీసులు నిందితుడ్ని కాపాడి అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అదేరోజు ఉదయం మెట్రో స్టేషన్ దగ్గర్లోని ఓ సూపర్ మార్కెట్లో దాడికి పాల్పడిన కత్తిని కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి పేరు వాంగ్ అని, అతడి మానసిక స్థితి సరిగాలేదని తెలిపారు. కాగా, స్థానికుల దాడిలో అతనికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+