కీవ్‌పై క్షిపణులతో భీకర దాడులు : ఉక్రెయిన్-రష్యా మధ్య నాలుగో విడత చర్చలు..!! పురోగతి సాధించేనా?
ఉక్రెయిన్ - రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రాజధాని కీవ్‌ను రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు కీవ్‌ను హస్త గతం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. పశ్చిమ కీవ్‌లోని రివ్స్‌లో ఓ అపార్ట్ మెంట్‌పై బాంబులు విసిరింది. ఈ ఘటనలో టీవీ టవర్‌తోపాటు అపార్మ్ మెంట్ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది.

కీవ్‌లో క్షిపణులతో దాడులు
ఖర్కిన్, ఒడెసా, ల్వీవ్ ప్రాందాల్లో కూడా దాడుల సైరన్‌కు మోగుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. రష్యా దాడులతో ఇప్పటికే చిన్నచిన్న నగరాలు పూర్తిగా తుడిసిపెట్టుకుపోయాయి. లక్షలాది మంది సరిహద్దు దేశాలకు పారిపోయారు. ఉక్రెయిన్‌కు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.
తమ లక్ష్యం నెరవేరేదాక వెనక్కి తగ్గేది లేదని, దాడులు కొనసాగుతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా దాడులను ముమ్మరం చేశారు. తాజాగా మరియోపోల్‌లో భవనాలపై కూడా వరుసగా క్షిపణులతో దాడులకు పాల్పడింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఉక్రెయిన్-రష్యో మధ్య మరోసారి చర్చలు
ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యా-ఉక్రెయిన్ దేశాల అధికారులు సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య మూడు సార్లు శాంతి చర్చలు జరిగాయి. టర్కీ వేదికగా ఉక్రెయిన్-రష్యా విదేశాంగ మంత్రులు సమావేశమై చర్చలు జరిపారు.
అయినా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఇవాళ మరోసారి వర్చువల్‌గా చర్చలు జరుపుతున్నారు. చర్చల్లో పురోగతి సాధిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యను ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని అటు ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
Recommended Video

అణువిద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా
మరోవైపు రష్యా దురాక్రమణతో చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాడులతో దెబ్బతిన్న వాటిని తాజాగా పునరుద్ధరించింది. దీంతో ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరాను మరలా ప్రారంభించినట్లు ఉక్రెయిన్ అణుశక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. ప్లాంట్‌లో ఉన్న కూలింగ్ సిస్టమ్స్ అన్ని సాధారణ స్థితిలో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. రష్యా దురాక్రమణలకు ముగింపు పలకాలని కోరారు.












Click it and Unblock the Notifications