ఒబామా ఏడ్పు అబద్ధం, ఉల్లిపాయలు పెట్టుకుని..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటించారని, ఆయన ఏడ్పు నిజం కాదని కన్జర్వేటివ్ పొలిటికల్ ఎనలిస్టు, ఫాక్స్ న్యూస్ చానెల్ వ్యాఖ్యాత ఆండ్రియా టాంటెరోస్ ఆరోపించారు. ఆమె వాస్తవంగా కన్నీళ్లు పెట్టుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు.
శాండీ హుక్ స్కూల్లో 2012లో తుపాకీ కాల్పులకు బలైన 20 మంది చిన్నారులను స్మరించుకుంటూ ఒబామా కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఒబామా ఏడవడం అనేది నమ్మశక్యంగా లేదని టీవీ చర్చా కార్యక్రమంలో ఆండ్రియా అన్నారు. కన్నీళ్లు తెచ్చుకోవడానికి ఒబామా ఉల్లిపాయలు వాడారనే ఆనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.

ఒబామా మాట్లాడిన తర్వాత వేదిక వద్ద ఉల్లిపాయ లేదా నో మోర్ టియర్స్ (జాన్సన్ బేబీ షాంపూ బ్రాండ్ నేమ్) కోసం వెతికానని, ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారంటే నమ్మాలని అనిపించడం లేదని, అసలు ఇది అవార్డుల సీజన్ అని ఆమె వ్యంగ్యంగా అన్నారు. ఒబామా ఉద్వేగం నమ్మశక్యం కాదని అన్నారు.
కోహోస్ట్ మిలిసా ఫ్రాన్సిస్ ఆండ్రియాతో గొంతు కలిపారు. అయితే ఒబామాపై ఫాక్స్ న్యూస్ విమర్శలు కొత్తేమీ కాదు. గత డిసెంబర్‌లో ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎనలిస్ట్ రాల్ఫ్ పీటర్స్, కంట్రిబ్యూటర్ స్టాసీ డాష్‌లను రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications