వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిస్అండ్‌టెల్: ఆమెపై పైర్, మరోచోట లవర్‌ని విసిగించి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఫ్రాన్స్‌కు చెందిన మాజీ తొలి మహిళ వాలెరీ ట్రిర్వీలర్ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్‌తో విడిపోయిన నేపథ్యంలో ఆమె కిస్ అండ్ టెల్ పుస్తకం తెస్తోంది. ఫ్రాంకోయిస్‌కు ఓ నటితో అఫైర్ ఉండటంతో విడిపోయింది. కిస్ అండ్ టెల్ పుస్తకంలో ఆమె తన రిలేషన్ షిప్ పైన పేర్కొంది.

మరోవైపు, ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన మాజీ ప్రేయసి స్పందన కోసం పట్టు విడవకుండా ప్రయత్నించి, చివరికి జైలుపాలయ్యాడు. దక్షిణ ఫ్రాన్స్‌లోని రోనే ప్రాంతానికి చెందిన ఈ ఫ్రెంచి కుర్రాడికి ప్రేయసి కొన్నేళ్ళ క్రితం గుడ్ బై చెప్పింది. 2011లో వారి సంబంధం తెగిపోయింది.

అప్పటి నుంచి ఆమెకు అతను ఆమెకు 21,807 ఫోన్లు, ఎస్సెమ్మెస్‌లు చేశాడు. ఇవన్నీ పది నెలల వ్యవధిలోనే చేశాడు. దీంతో, ఆ యువతి విసుగెత్తిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతగాడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం స్వల్ప జైలుశిక్ష విధించింది.

France's Valerie criticised

తామిద్దరం ఓ అపార్ట్ మెంట్లో కలసి ఉన్నప్పుడు ఆమె కోసం తాను ఇంటిపని కూడా చేశానని చెప్పాడు. అందుకు పరిహారం చెల్లించాలని ఆమెను కోరానని తెలిపాడు. ఆ డబ్బు ఇచ్చేంతవరకైనా ఫోన్ ద్వారా ఆమెతో మాట్లాడవచ్చన్నది తన ఆలోచన అని వెల్లడించాడు.

కనీసం, 'థాంక్ యూ' అని చెప్పినా చాలని భావించానని, అందుకే, ఆమెకు అన్నిసార్లు ఫోన్, ఎస్సెమ్మెస్ చేశానని వివరించాడు. ఈ కేసు విచారించిన కోర్టు, ఇకపై ఆ యువతిని ఏ విధంగానూ వేధించరాదని స్పష్టం చేసింది. అతనికి మానసిక చికిత్స అందించాలని అధికారులను ఆదేశించింది.

English summary

 France's Valerie Trierweiler faced a backlash of criticism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X