పాలస్తీనాపై ఫ్రాన్స్ సంచలన నిర్ణయం.. అమెరికా-ఇజ్రాయెల్ ఆగ్రహం

France: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ దేశం పాలస్తీనా దేశాన్ని గుర్తించబోతోందని ప్రకటించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్ అధికారికంగా గుర్తిస్తుందని ఆయన వెల్లడించారు. జీ7 కూటమిలో పాలస్తీనాను గుర్తించిన మొదటి దేశం ఫ్రాన్స్ అవుతుంది. ఫ్రాన్స్ ఈ నిర్ణయాన్ని సౌదీ అరేబియా స్వాగతిస్తుండగా.. ఫ్రాన్స్ మిత్రదేశమైన అమెరికా దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఫ్రాన్స్ ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటన.. శాంతికి కొత్త మార్గం?
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా చేసిన ఒక ప్రకటనలో.. న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం(UNGA)లో పాలస్తీనా దేశాన్ని గుర్తించే అధికారిక ప్రకటన చేయబడుతుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని ఫ్రాన్స్ నిర్ణయించుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ప్రాంతంలో న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు.

మాక్రాన్ తమ అధికారిక ప్రకటనలో కీలక విషయాలు
హమాస్‌ను నిరాయుధీకరణ: హమాస్‌ను నిరాయుధం చేయాలని మేము హామీ ఇవ్వాలి. ఇది ప్రాంతీయ భద్రతకు అత్యవసరం.

గాజా భద్రత, పునర్నిర్మాణం: గాజా ప్రాంతాన్ని సురక్షితం చేయడం, యుద్ధం వల్ల దెబ్బతిన్న దానిని పునర్నిర్మించడం మా లక్ష్యం. గాజా ప్రజలకు మానవతా సహాయం అందించడం, వారికి సాధారణ జీవితాన్ని తిరిగి తీసుకురావడం అత్యంత ప్రాధాన్యత.

పాలస్తీనా దేశ నిర్మాణం: చివరకు మేము స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని నిర్మించాలి. ఇది రెండు-దేశాల పరిష్కారానికి ప్రాతిపదిక. పాలస్తీనా ప్రజలకు ఆత్మనిర్ణయ హక్కు, వారి సొంత దేశం ఉండాలి.

ఇజ్రాయెల్‌కు పూర్తి గుర్తింపు: పాలస్తీనా నిరాయుధీకరణను అంగీకరించి, అదే సమయంలో ఇజ్రాయెల్‌కు పూర్తి గుర్తింపునివ్వడం ద్వారా, మధ్యప్రాచ్యంలో అందరి భద్రతకు దోహదపడుతుందని నిర్ధారించుకోవాలి. ఇజ్రాయెల్ భద్రతను కాపాడటం కూడా అంతే ముఖ్యం.ఈ చర్యల ద్వారానే మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన సాధ్యమవుతుంది. దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదని మాక్రాన్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.

France to Officially Recognize Palestine at UNGA 2025 A Historic Shift Amid US-Israel Backlash

స్వాగతించిన పాలస్తీనా అధికారులు
పాలస్తీనాను గుర్తించే మాక్రాన్ ప్రకటనను పాలస్తీనా అధికారులు స్వాగతించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ డిప్యూటీ హుస్సేల్ అల్-షేఖ్ మాట్లాడుతూ, "ఈ వైఖరి అంతర్జాతీయ చట్టం పట్ల ఫ్రాన్స్ నిబద్ధతను, పాలస్తీనా ప్రజల ఆత్మనిర్ణయ హక్కును, పాలస్తీనా దేశ స్థాపనకు దాని మద్దతును చూపుతుంది" అని అన్నారు.

మాక్రాన్‌పై అమెరికా ఆగ్రహం.. నెతన్యాహు హెచ్చరిక
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటనపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా రాశారు. "ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి ఆయన ప్రణాళికను అమెరికా బలంగా తిరస్కరిస్తుంది. ఈ నిర్లక్ష్యపు నిర్ణయం హమాస్ ప్రచారాన్ని పెంచుతుంది. శాంతికి నష్టం కలిగిస్తుంది. ఇది అక్టోబర్ 7 బాధితుల ముఖంపై ఒక చెంపదెబ్బ." అని అన్నారు.

అక్టోబర్ 7, 2023న పాలస్తీనా సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది, ఇందులో 1,200 మందికి పైగా మరణించారు. వందలాది మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాలో సైనిక దాడులను ప్రారంభించింది, దీంతో గాజా ధ్వంసమైంది. అక్కడ లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యను పరిష్కరించడానికి "టూ స్టేట్ సొల్యూషన్" అంటే పాలస్తీనియన్ల కోసం ఒక ప్రత్యేక దేశం అనే దానికి ఇజ్రాయెల్ ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్ పాలస్తీనా దేశాన్ని గుర్తించబోతుండటంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెతన్యాహు ఎక్స్(ట్విట్టర్)లో ఇలా రాశారు. "అక్టోబర్ 7న జరిగిన ఊచకోత తర్వాత టెల్ అవీవ్ దగ్గర పాలస్తీనా దేశాన్ని గుర్తించే అధ్యక్షుడు మాక్రాన్ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్య ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. గాజా వంటి మరో ఇరానియన్ ప్రాక్సీ రాష్ట్రం ఏర్పడే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒక పాలస్తీనా దేశం, ఇజ్రాయెల్ నాశనానికి ఒక ప్రారంభ స్థావరంగా ఉంటుంది తప్ప, దానితో శాంతియుతంగా జీవించే దేశం కాదు. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌తో ఒక దేశాన్ని కోరడం లేదు, బదులుగా వారు ఇజ్రాయెల్‌ను తొలగించి ఒక దేశాన్ని కోరుతున్నారు అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను." అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలలో 140 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. ఈ దేశాలలో స్పెయిన్, ఐర్లాండ్ వంటి కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ ప్రధాన మిత్రదేశాలైన అమెరికా, దాని మిత్రదేశాలైన బ్రిటన్ మొదలైనవి ఇప్పటివరకు పాలస్తీనా దేశాన్ని గుర్తించలేదు. అయితే, ఫ్రాన్స్ ప్రకటనతో బ్రిటన్‌పై కూడా పాలస్తీనా దేశాన్ని గుర్తించే ఒత్తిడి పెరుగుతోంది. శుక్రవారం బ్రిటన్ విదేశాంగ విధానాన్ని పర్యవేక్షించే కమిటీ, ఫారిన్ అఫైర్స్ కమిటీ పార్లమెంటు సభ్యులు పాలస్తీనా దేశాన్ని వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు.

సౌదీ అరేబియా ప్రశంసలు
పాలస్తీనా దేశాన్ని గుర్తించే ఫ్రాన్స్ నిర్ణయాన్ని ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా స్వాగతించింది. సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. "ఈ చారిత్రక నిర్ణయాన్ని సౌదీ అరేబియా ప్రశంసిస్తుంది. ఈ నిర్ణయం పాలస్తీనా ప్రజల ఆత్మనిర్ణయ హక్కు, 1967 సరిహద్దులపై తూర్పు జెరూసలేంను తమ రాజధానిగా చేసుకుని పాలస్తీనా దేశాన్ని స్థాపించే హక్కుపై అంతర్జాతీయ సమాజం సాధారణ ఏకాభిప్రాయాన్ని ధృవీకరిస్తుంది." పాలస్తీనా దేశాన్ని ఇంకా గుర్తించని దేశాలు కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. సౌదీ అరేబియా పాలస్తీనియన్ల కోసం ఒక స్వతంత్ర దేశం ఏర్పాటుకు పదేపదే పిలుపునిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+