వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిలాడీ లేడీ: విడాకులివ్వకుండానే 10మందితో పెళ్లిళ్లు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఆమెకు యువకులను మోసం చేసి పెళ్లి చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అందుకే ఆమె సుమారు పదేళ్ల కాలంలో పదిమందికి పైగా యువకులను పెళ్లి చేసుకుంటూ జల్సాలు చేసింది. వివాహం జీవితంలో భర్తతో వివాదాలు చోటు చేసుకుంటే అతడ్ని విడిచిపెట్టి మరో వ్యక్తిని ఆమె పెళ్లాడేది. ఆమె వయస్సు ఇప్పుడు 39ఏళ్లు.

వివరాల్లోకి వెళితే.. ఆమె అంటే లియానా క్రిస్టినా బారియంటోస్ 2002, వాలెంటైన్స్ రోజున లాంగ్ ఐస్లాండ్‌లో ఓ యువకుడితో వివాహం చేసుకుంది. ఆ తర్వాత 15 రోజులకే అతనితో విడిపోయి మరో వ్యక్తితో వివాహం చేసుకుంది. మరో 13 రోజుల్లోనే ఆమె మరో ఇద్దరు యువకులను పెళ్లాడింది.

Fraud Case for Woman Who Married Many Men

ఇలా ఒక్క న్యూయార్క్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు పురుషులతో వివాహం చేసుకుంది. 1999 నుంచి ప్రారంభించిన ఈ వివాహాల కార్యక్రమంలో ఆమె పది మందికి పైగా పురుషులను పెళ్లి చేసుకుని వదిలేసింది.

ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరి వద్ద నుంచి విడాకులు మాత్రం పొందకపోవడం గమనార్హం. ఇప్పటివరకూ తన మ్యారేజ్ లైసెన్స్‌పై పెళ్లి కానట్టే ధృవీకరించి మోసపు చర్యలకు పాల్పడింది. కాగా, శుక్రవారం ఆమెపై మోసపు అభియోగాలు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

English summary
The year 2002 was very busy for a young woman named Liana Kristina Barrientos. For one thing, she was married - on Long Island, on Valentine's Day.For another, she married again, 15 days later, in Rockland County, to a different man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X