ఎండ నుండి కాపాడే బికినీ, స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం
లండన్: అతినీలలోహిత వికరణ తీవ్రతను అంచనావేసి, భానుడి వేడి ప్రమాదం ఉందని హెచ్చరించే స్మార్ట్ బికినీని ఫ్రెంచ్ సంస్థ రూపొందించింది. రూ.10వేల నుంచి రూ.14వేల మధ్య విలువ కలిగిన ఈ స్పినాలీ బికినీలో జల నిరోధక సెన్సార్లను ఏర్పాటు చేశారు.
ఇవి అతినీలలోహిత వికిరణ తీవ్రతను అంచనా వేస్తాయి. ఆ సమాచారాన్ని ధరించిన వ్యక్తి స్మార్ట్ ఫోన్‌కు పంపిస్తాయి.

ఆ తర్వాత సూర్యుడి ప్రభావం నుంచి కాపాడే క్రీం రాసుకోవాలని లేదా నీడలో ఉండాలని బికినీ ధరించిన వ్యక్తికి హెచ్చరికలు అందిస్తుంది. దీని కోసం ఈ బికినీని ధరించిన వ్యక్తి చర్మతత్వానికి సంబంధించిన విషయాలను స్మార్ట్ ఫోన్లో ఉన్న బికినీ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
సముద్రపు ఒడ్డున బికినీతో సూర్యుడి ప్రభావానికి గురవుతున్న కొందరిని చూసినప్పుడు ఈ స్మార్ట్ బికినీ ఆలోచన వచ్చిందని దీనిని రూపొందించిన వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications