మాజీ ప్రేయసికి వేల మెసేజ్‌లు పంపి జైలు పాలు

French man jailed for texting and calling his ex-girlfriend 21,807 times
ప్యారిస్: మాజీ ప్రేయసికి వేల మెసెజ్‌లు పంపి, కాల్స్ చేసిన ఫ్రెంచ్ వ్యక్తి జైలు పాలయ్యాడు. మాజీ ప్రేయసికి ఏకంగా 21,807 సార్లు అతను మెసేజ్‌లు పంపించాడు లేదా కాల్స్ చేశాడు. ఆ వ్యక్తికి ఫ్రాన్స్ కోర్టు 10 నెలల పాటు జైలు శిక్ష, జరిమానా విధించింది.

వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం - ఫ్రాన్స్‌కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి, 32 ఏళ్ల మహిళ 2011లో విడిపోయారు. అయితే తనను వీడిపోయిందనే మనస్తాపంతో ఆ వ్యక్తి ఏకంగా ఆమెకు వేల కొలది కాల్స్, మెసేజ్‌లు చేశాడు. ప్రతి రోజూ సగటున 73 కాల్స్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి.

ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లతో విసుగు చెందిన మహిళ తన ఫోన్‌ను ఆఫ్ చేస్తే ఆమె ఇంటికి, తల్లిదండ్రులకు, ఆమె పనిచేసే కార్యాలయానికి ఫోన్ చేసేవాడని తెలిసింది. అతనికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం అతనికి తొలుత మానసిక చికిత్స చేయించాలని ఆదేశించింది.

అతను కేవలం పది నెలల కాలంలో 21 వేలకు పైగా కాల్స్, మెసేజ్‌లు చేశాడు. ఆరోపణలు చేయడానికి తీసుకున్న 90 నిమిషాల్లో తన మహిళా క్లయింట్‌కు వందకు పైగా ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఆమె తరఫు న్యాయవాది చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+