Playboy మ్యాగజైన్ కవర్ ఫొటోగా మహిళా మంత్రి.. !
ప్యారిస్: అమెరికాకు చెందిన ఎంటైర్టెన్మెంట్ మేగజైన్ ప్లేబాయ్ కవర్ పేజీపై ఫ్రాన్స్ మహిళా మంత్రి ఫొటో ప్రచురితం కావడం వివాదాస్పదంగా మారింది. ఫ్రాన్స్ ప్రభుత్వంలోని మహిళా మంత్రి మార్లీనె షియప్పా.. సోషల్ ఎకానమీ, అసోసియేషన్స్ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె ఇటీవల ప్లేబాయ్ పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

అంతేగాక, ఈ గ్లామర్ మేగజైన్‌లో ఫొటో షూట్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులను ధరించారు. అయితే, ఆమె వస్త్రాధారణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వేసుకున్న దుస్తులు తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయని మండిపడుతున్నారు. ఈ ఫొటోపై స్పందించిన ఫ్రాన్స్ ప్రధాని ఎలిసాబెత్ బోర్నే.. మార్లీనెను పిలిపించి వివరణ తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేసిన పని సరైంది కాదు అని ఆ మంత్రికి ప్రధాని చెప్పినట్లుగా పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, దాదాపు 12 పేజీల ఈ ఇంటర్వ్యూలో మహిళలు, గే హక్కులు, అబార్షన్లపై ఫ్రాన్స్ మంత్రి మార్లీనె ప్రముఖంగా మాట్లాడారు. ఈ విషయం ఫ్రాన్స్ ప్రభుత్వంలోని ప్రధాని, వామపక్ష సభ్యులకు నచ్చలేదు. ఈసారి ఆమె తప్పు చేశారని విమర్శించారు. అయితే, మార్లీనె మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటున్నట్లు స్పష్టం చేశారు.
Invité ce matin sur Europe1 le Ministre de l’intérieur @GDarmanin apporte son soutien à @MarleneSchiappa sur sa Une Une de #playboy. Il cite Cookie Dingler : « vous ne me ferez pas dire de mal de Marlène Schiappa (…) être une femme libérée, c’est pas si facile » pic.twitter.com/pz50OoQdls
— Jeanne Baron (@jeannebarontv) April 2, 2023
మహిళలకు వారి శరీరాలపై ఉన్న హక్కులను కాపాడుకోవాలి. వారు ఏమీ కావాలనుకుంటే అది ఎక్కడైనా చేసేట్లు ఉండాలి. తిరోగమనవాదులు, ఆత్మవంచకులు ఎంత విసిగించినా.. ఫ్రాన్స్‌లో మహిళలు స్వేచ్ఛగా ఉన్నారని మార్లీనె ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేగాక, ఫొటో షూట్ సమయంలో తాను దుస్తులు ధరించే ఉన్నానని మార్లీనె చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications