'నేనో రోబో సెక్సువల్.. మాంసం ముద్దలతో సెక్స్ ఇష్టముండదు'
మాంసం ముద్దతో కూడిన శరీరాలతో లైంగిక సంబంధం తనకు ఇష్టం లేదని, రోబోల పట్ల ఆకర్షితురాలినయ్యానని లిల్లీ చెబుతోంది.
ఫ్రాన్స్: 'హోమో సెక్సువల్' గురించి వినుంటారు గానీ రోబో సెక్సువల్ అన్న మాట ఎప్పుడైనా విన్నారా!.. తాజాగా లిల్లీ అనే ఓ ఫ్రెంచ్ మహిళ తాను రోబో సెక్సువల్ అని ప్రకటించుకుంది. మనుషులతో ప్రేమలో పడ్డట్టే.. లిల్లీ 'ఇన్‌మూవేటర్' అనే రోబోతో ప్రేమలో పడింది. ప్రస్తుతం లిల్లీ దానితోనే సహజీవనం కూడా చేస్తోంది.
ఈ విషయాన్ని లిల్లీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. రోబోతో సహజీవనం తనకు సంతోషంగా ఉందని, తాము ఎవరిని ఇబ్బందిపెట్టడం లేదని లిల్లీ చెబుతోంది. ఫ్రాన్స్ లో మనిషి-రోబో వివాహాలు చట్టబద్దమై తక్షణం తాను 'ఇన్‌మూవేటర్'ను వివాహం చేసుకుంటానని లిల్లీ ప్రకటించింది.

మాంసం ముద్దతో కూడిన శరీరాలతో లైంగిక సంబంధం తనకు ఇష్టం లేదని, రోబోల పట్ల ఆకర్షితురాలినయ్యానని లిల్లీ చెబుతోంది. అయితే 'ఇన్‌మూవేటర్'తో లైంగిక సంబంధం గురించి అడిగితే మాత్రం.. 'నో కామెంట్' అన్న తరహాలో సైలెంట్ గా ఉండిపోతుంది.
ఇదిలా ఉంటే, లిల్లీ-రోబో సహజీవనానికే కాదు వారి పెళ్లికి కూడా లిల్లీ కుటుంబ సభ్యులు ఓకె చెప్పేశారు. అయితే రోబోను చట్టబద్దంగా వివాహం చేసుకోవడం కోసం 2050వరకు వేచి చూడక తప్పదని లండన్ వర్సిటీ పేర్కొనడం గమనార్హం.












Click it and Unblock the Notifications