సౌదీపై విరుచుకుపడుతున్న హౌతీలు: రియాద్ ఎయిర్‌పోర్ట్ పై భీకర దాడి: 12 మందికి పైగా మృతి

సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. భారీ దాడికి దిగారు. మిస్సైళ్లు, డ్రోన్ దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 309 మంది వరకు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఈ దాడులన్నీ కూడా ప్రధానంగా రాజధాని రియాధ్ లోని కింగ్ ఖాలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా సాగాయి.

ఈ ఘటనతో సౌదీ అరేబియా ప్రభుత్వం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమానాల రాకపోకలను రద్దు చేసింది. రియాధ్ కు చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ జామున ఈ దాడులు చోటు చేసుకున్నాయి. విమానాశ్రయం టెర్మినల్-3 పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఎయిర్‌పోర్ట్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు ధాటికి టెర్మినల్ భవనం లోపల సీలింగ్, రూఫ్ నిర్మాణాలు, స్తంభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలావస్థకు చేరుకున్నాయి.

Fresh strike on Riyadh international airport killed 12 people and injured 309 as the Houthis claimed responsibility

ఈ సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మరణించిన 12 మంది వివరాలను సౌదీ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఇందులో నలుగురు సౌదీ అరేబియా పౌరులు, ఇద్దరు బంగ్లాదేశీయులు ఉన్నారు. అమెరికా, జోర్డాన్, పాలస్తీనా, సిరియా, సుడాన్, ఈజిప్ట్ కు చెందిన ఒక్కొక్కరు దుర్మరణం పాలయ్యారు.

ఈ సాయంత్రమే తిరుమలలో ప్రధాన ఘట్టం: రేపటి నుంచి నవాహ్నిక ఉత్సవాలు
ఈ సాయంత్రమే తిరుమలలో ప్రధాన ఘట్టం: రేపటి నుంచి నవాహ్నిక ఉత్సవాలు

దాడి అనంతరం విమానాల రాకపోకలను నిలిపివేశారు. రియాద్ ఎయిర్‌పోర్ట్ నుండి టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు నిలిచిపోయాయి. రియాద్ రావలసిన పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానాలను రద్దు చేశారు. ఈ పరిణామాల వల్ల ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు సూచనలు జారీ చేశాయి. విమానాల సర్వీసులను పునరుద్ధరించిన తర్వాతే ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలని కోరాయి.

నాకొచ్చిన నష్టం ఏమీ లేదు- బీసీసీఐకి మహ్మద్ షమీ చురకలు
నాకొచ్చిన నష్టం ఏమీ లేదు- బీసీసీఐకి మహ్మద్ షమీ చురకలు

రియాద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం ఈ వారంలో ఇది మూడోసారి. అంతకుముందు గురువారం జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ముగ్గురు సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. రవాణా మౌలిక వసతులు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు తమ సైనిక చర్యల తీవ్రతను పెంచారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది.

ఈ దాడులపై అటు అమెరికా కూడా స్పందించింది. హౌతీలపై సౌదీ అరేబియా ఎదురుదాడులు చేపడితే తాము అందులో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలిస్తామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్ హౌస్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దాడిపై ఆరా తీస్తోన్నామని, సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టామని అన్నారు. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+