డైట్ పిల్స్-అండర్‌వేర్ వరకు: ఇవాంకా ట్రంప్ కోసం చైనా కంపెనీల కుస్తీ, ఎందుకంటే..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చినప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తన అందచందాలతో ఇవాంక ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయారు.

వాషింగ్టన్/బీజింగ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిల్చినప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తన అందచందాలతో ఇవాంక ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయారు. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతోనే ఆమె చైనా కంపెనీలకు కల్ప వృక్షంలా కనిపించారు.

దీంతో ఆమె పేరుకు కూడా ఎక్కడా లేని పాప్యులారిటీ వచ్చేసింది. ఆమె పేరు మీద కాస్మెటిక్ సర్జరీలు కూడా వచ్చేశాయి. ఇవాంక లాగా కనిపించాలంటే... కాస్మెటిక్ సర్జరీ చేస్తామంటూ ఓ చైనా కంపెనీ ప్రకటిస్తోంది. ఆమె పేరు కోసం చైనా కంపెనీలు కుస్తీ పడుతున్నాయి.

From Diet Pills To Underwear: Chinese Firms Scramble To Grab Ivanka Trump Trademark

ఇవాంక ట్రంప్ పేరునో, లేదా అలాంటి ఉచ్చారణతో ఉండే పేరునో తమ బ్రాండ్ లకు పెట్టుకునే అవకాశం ఇవ్వాలంటూ అనేక కంపెనీలు చైనాలో పోటీపడుతూ దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 258 కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి.

ఇవాంక పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో స్పా సర్వీసులు, డైట్ పిల్స్, చర్మం ముడతలు పడకుండా కాపాడే క్రీములు, మసాజ్ మెషీన్లు, లో దుస్తులు, శానిటరీ నాప్ కిన్లు, కాస్మొటిక్ సర్జరీలు ఉన్నాయి. ఇవాంక ట్రంప్.. దేవతలా కనిపిస్తోందని చైనా నెటిజన్లు చెప్పుకుంటుండటం విశేషం.

డొనాల్డ్ ట్రంప్ మాత్రం చైనా అంటేనే మండిపోతున్న విషయం తెలిసిందే. చైనా ఉత్పత్తులపైనా ట్రంప్ ద్వేషం వెళ్లగక్కారు. మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులనే కొనుగోలు చేయాలంటూ ఆయన అమెరికన్లకు పిలుపును కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూతురు పేరుపైనే చైనా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+