సొరంగ మార్గాలు, కళ్లు చెదిరే సౌకర్యాలు -వైట్‌హౌస్ ప్రత్యేకతలు..!!
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ మరి కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ప్రపంచ దేశాల నుంచి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఇక నుంచి ట్రంప్ వైట్‌హౌస్ కేంద్రంగా తన అధికారిక కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ప్రపంచ చరిత్ర మలుపు తిప్పిన నిర్ణయాలకు సాక్షంగా నిలిచిన ఈ వైట్‌హౌస్ కు ఎంతో సుదీర్ఘ చరిత్ర.. మరెంతో ప్రత్యేకత ఉంది.
వైట్‌హౌస్ ప్రత్యేకతలు
వైట్‌హౌస్ ను తొలుత ప్రెసిడెంట్స్ ప్యాలెస్.. ఆ తరువాత ఎగ్జిక్యూటివ్ మాన్షన్ గా వ్యవహరించే వారు. ఒకసారి ఈ భవనంలో మంటలు చెలరేగిన సమయంలో తిరిగి పెయింటింగ్ వేసినప్పుడు తెలుపురంగు వేయడంతో అప్పటి నుంచి హౌట్ హౌస్ గా మారిపోయింది. 1901లో అధ్యక్షుడిగా ఉన్న రూజ్‌బెల్డ్ ఈ పేరును వాడటం మొదలు పెట్టారు. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ తన కలను సాకారం చేసుకోవడానికి 1971లో వైట్ హౌస్ స్థలాన్ని ఎంచుకున్నారు. రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ హయాంలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీని నిర్మాణానికి అప్పట్లో సుమారు రూ.13 కోట్లు ఖర్చు చేసారు.

కళ్లు చెదిరే నిర్మాణం
వైట్‌హౌస్ మొత్తంగ 8 ఎకాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ భవనంలో ఆరు అంతస్థులు. కాగా, భవనం లోపల నిర్మాణ స్థలం 55 వేల చదరపు అడుగులు. వైట్‌హౌస్ లో మొత్తం 132 గదులు, 142 తలుపులు, 147 కిటికీలు, 35 బాత్‌రూమ్‌లు, 3 ఎలివేటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వైట్‌హౌస్ లో ఒకేసారి 140 మంది కూర్చుని తినగలిగే డైనింగ్ టేబుల్‌తో పాటు 13 వేల చాకులు, చెంచాలు ఉంటాయి. వైట్‌హౌస్ నిర్వహణ కోసం 5,700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు నివసించే ఈ భవనం లో భద్రతా పరంగానూ నిర్మాణాలు చేసారు. ఈ భవనం భూగర్భంలో ఓ బంకర్ కూడా ఉంది.
సొరంగ మార్గాలతో
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఇక్కడి నుంచే విధులు నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలు ముందస్తుగానే ఏర్పాటు చేసారు. అదే విధంగా భవనం లో సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితం భవనానికి స్వల్ప మార్పులు చేసారు. అతిధుల కోసం భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడకు వచ్చే ప్రపంచ నాయకుల వినోదం కోసం ప్రత్యేక స్థలం కూడా ఏర్పాటు చేశారు. అమెరికన్ చరిత్ర గురించి సమాచారం ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇక.. ప్రపంచంలో కీలక చారిత్రక నిర్ణయాలకు ఈ భవనం ఒక కేంద్రంగా మారిపోయింది. శ్వతే సౌధంలో ఇప్పుడు మరోసారి ట్రంప్ అడుగు పెట్టేందుకు సర్వం సిద్దమైంది.












Click it and Unblock the Notifications