నెల ఇంటి కిరాయి 17 లక్షలు .. కొత్తగా వజ్రాల వ్యాపారం ... లండన్ లో నీరవ్ మోదీ విలాస జీవనం

Recommended Video

    Nirav Modi Tracked Down To £8 Million Flat In London | Oneindia Telugu

    లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్ల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ గెటప్ మార్చారు. చిన్నగా గడ్డం పెంచి, మీసాలు పెంచి తిరుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను టెలీగ్రాఫ్ ప్రతిక ప్రచురించింది. ఇలా వేషం మార్చి లండన్ వీధుల్లో తిరుగుతున్నట్టు తన కథనంలో పేర్కొన్నది.

    విలాసవంతమైన భవనంలో బస ..

    విలాసవంతమైన భవనంలో బస ..

    బ్యాంకులకు ఎగనామం పెట్టిన నీరవ్ మోదీ విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. లండన్ లో 8 మిలియన్ యూరో విలువైన అపార్ట్ మెంట్ లో జీవిస్తున్నారు. ఆ అపార్టుమెంట్ నెల కిరాయి అక్షరాల 17 లక్షలని టెలీగ్రాఫ్ పత్రిక తెలిపింది. అలాగే తనకు వెన్నతో పెట్టిన వజ్రాల వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించినట్టు పేర్కొన్నది. దీంతోపాటు లండన్ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.

    మారిన గెటప్ ...

    విదేశాలకు చెక్కేశిన నీరవ్ మోదీ .. తన వేషధారణను పూర్తిగా మార్చివేశారు. ఎప్పుడూ క్లీన్ గా ఉండే మీసాలను పెంచేశాడు. అలాగే చిన్నగా గడ్డం పెంచాడు. దీంతోపాటు వెంట్రుకలు పెంచి, జాకెట్ ధరించాడు. ఎవరైనా కొత్తగా ఆయనను చూస్తే నీరవ్ మోదేనా అనుకునేంత లుక్ ను మార్చివేశాడు. ఇంతలో టెలీగ్రాఫ్ రిపోర్టర్ కల్పించుకోని భారతదేశంలో వచ్చిన ఆరోపణలపై స్పందించాలని కోరితే .. నో కామెంట్స్ అని చెప్పి చిరునవ్వి అక్కడినుంచి వెళ్లిపోయాడని తెలిపింది. విదేశాలకు వెళ్లాక నీరవ్ .. తన గెటప్ మారుస్తారని నిఘావర్గాలు ముందే అంచనా వేశాయి. ప్రజల్లో ఉంటూ గుర్తుపట్టకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతారని పేర్కొన్నది. ఇంటెలిజెన్స్ చెప్పినట్టు వేషధారణను పూర్తిగా మార్చివేశాడు నీరవ్.

    యుకే అధికారులపై ఆగ్రహం

    యుకే అధికారులపై ఆగ్రహం

    దేశం నుంచి వెళ్లిపోయిన నీరవ్ మోదీ .. లండన్ లో ఉన్నట్టు సమాచారం ఉంది. దీంతో రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేశారు. అతనిని తమకు అప్పగించాలని ఈడీ అధికారులు కోరారు. అయినా అక్కడినుంచి ఆశించినా స్పందన రాలేదు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి పలుమార్లు విన్నవించినా .. వారి వైఖరిలో మార్పురాలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. తాము జారీచేసిన రెడ్ కార్నర్ నోటీసుతో నీరవ్ ను అరెస్ట్ చేసి .. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిస్తే విచారణ కొనసాగుతోందని .. కానీ అందుకు లండన్ అధికారుల నుంచి సహకారం అందడం లేదని పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+