భార్యపై కోపంతో వెరైటీ ప్రతీకారం: చుక్కలు చూపించాడు (వీడియో)
మాస్కో: తన భార్య కేవలం రూ. 57 వేల ప్రైజ్ మనీ కోసం ఇంటి పేరు మార్చుకుందని ప్రతీకారంతో రగిలిపోయిన భర్త వెరైటీగా ప్రతీకారం తీర్చుకున్న ఘటన రష్యాలో జరిగింది. భార్యపై తన కోపం చల్లారిపోవడంతో కూల్ గా అతను అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
యూట్యూబ్ లో వైరల్ అయిన ఈ వీడియో ప్రకారం రష్యాలో ఓవర్నీ (నమ్మకం) అనే స్థానిక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్ తన ప్రచారంలో భాగంగా మహిళలు ఎవరైతే మా సూపర్ మార్కెట్ పేరును సర్ నేమ్ గా పెట్టుకుంటారో వారికి రూ, 57 వేలు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటించింది.
ఓ వ్యక్తి భార్య రూ. 57 వేల ప్రైజ్ మనీ అందుకునేందుకు తన భర్త తరపున వచ్చిన ఇంటిపేరును తొలగించుకుని ఆ స్టోర్ పేరును సర్ నేమ్ గా పెటుకుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త పగతో రగిలిపోయాడు.
ఎలాగైనా భార్య మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. భార్య కారును అదే సూపర్ మార్కెట్ స్టోర్ ముందుకు తీసుకెళ్లి పార్క్ చేశాడు. తరువాత ఓ సిమెంట్ మిక్సింగ్ లారీని పిలిపించి భార్య కారు అద్దాల గుండా లోపల కాంక్రీట్ నింపేశాడు.
అటువైపు వెలుతున్న వారు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించగా తన భార్య చేష్టలపై విసిగెత్తి ఇలా చేస్తున్నానని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే ఈ వీడియో చూసిన వారు పలురకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది.












Click it and Unblock the Notifications