యోగాతో ఆరోగ్యం, మనశ్శాంతి... అర్జెంటీనాలో ప్రజలకు యోగాపై ప్రధాని క్లాస్
ఆరోగ్యం, మనస్సుకు శాంతిని ఇచ్చే యోగా ప్రపంచానికి ఒక బహుమానం అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బ్యూనస్ ఏరీస్‌లో యోగా పై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ యోగా గురించి చెప్పారు. యోగా చేయడం వల్ల ప్రతిఒక్కరితోను సంతోషం పంచుకునే యోగం దక్కుతుందని ప్రధాని చెప్పారు. తాను 24 గంటలకు పైగా ప్రయాణించి 15వేల కిలోమీటర్లు దాటి వచ్చినట్లు చెప్పిన ప్రధాని... అక్కడి వారు కనబర్చిన ప్రేమ ఉత్సాహం చూసి తాను భారత్‌లో ఉన్న భావనే కలిగిందని చెప్పారు.

భారత్ అర్జెంటీనాలను యోగా అనుసంధానం చేస్తోంది
యోగా ఫర్ పీస్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఆపేరు పెట్టినందుకు మోడీ అభినందించారు. యోగా అనేది మనస్సును శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుందన్నారు. మనస్సు ప్రశాంతంగా ఉంటే కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని... తద్వారా సమాజం, దేశం, ప్రపంచంలో శాంతి నెలకొంటుందని చెప్పారు. యోగా భారత దేశానికి ఒక అపురూపమైన కానుకగా అభివర్ణించిన ప్రధాని... భారత్‌ను అర్జెంటీనాను అనుసంధానం చేస్తోందని చెప్పారు. ఇరుదేశాలతో పాటు ఇక్కడి ప్రజలను కూడా యోగా కలుపుతోందన్నారు.

భారత్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు అభిమానులున్నారు
అర్జెంటీనాలో చాలామందికి భారత కళలు, సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు ప్రధాని. అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు భారత్‌లో చాలా మంది అభిమానులున్నారని తెలిపారు. మారడోనా పేరును ప్రతి ఒక్కరు తలుచుకుంటూ ఉంటారని చెప్పారు. అంతేకాదు ఒడిషాలో జరిగిన హాకీ ప్రపంచ కప్ తొలిమ్యాచ్‌లో అర్జెంటీనా గెలవడంపై ఆ జట్టుకు అభినందనలు తెలిపారు. జీ-20 సదస్సును అర్జెంటీనా నిర్వహించడాన్ని తాను గర్వంగా భావిస్తున్నట్లు చెప్పిన ప్రధాని ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన అభివృద్ధి, వాతావరణం, రుణఎగవేతదారులపై చర్చిస్తామన్నారు.

ఆంటోనియో గుటెరర్స్, సౌదీ రాజులతో ప్రధాని భేటీ
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరర్స్‌తో సమావేశమై ప్రపంచ వాతావరణ పరిస్థితిపై భారత్ ఎలాంటి పాత్ర పోషిస్తుందో చర్చించారు. సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌ను కూడా కలిశారు ప్రధాని . ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు తీసుకోవాల్సి న చర్యలు, సాంస్కృతిక, ఇంధనం అంశాలపై చర్చించారు. అంతేకాదు సాంకేతిక, పునరుద్పాదక శక్తి, ఆహార భద్రతపై పెట్టుబడలపై చర్చించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications