ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్: తొలి గే పీఎం, అతి పిన్న వయస్కుడు
ప్యారిస్: ఫ్రాన్స్‌కు కొత్త ప్రధాని నియమితులయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ విద్యాశాఖ మంత్రి గాబ్రియెల్ అట్టల్ (Gabriel Attal)ను ప్రధానిగా నియమించారు. ప్రపంచంలోనే ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్నవయస్కుడు ఈయనే కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన వయస్సు 34. అంతేగాక, ఈయన స్వలింగ సంపర్కుడు.
ప్రధాని పదవికి ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేయడంతో తాజా నియామకం జరిగింది. ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బోర్న్ రాజీనామా చేశారు. సోమవారం మాక్రాన్ దానికి తెలిపారు. కాగా, కొత్త చట్టం ప్రకారం.. విదేశీయులను వెనక్కి పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి.

కాగా, కరోనావైరస్ మహమ్మారి సమయంలో అట్టల్ పేరు బాగా వినిపించింది. అప్పుడు ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించారు. అంతేగాక, ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దేశంలో ప్రజాదరణ గల నాయకులలో అట్టల్ కూడా ఒకరుగా ఉండటం గమనార్హం. అంతేగాక, తెలివైన మంత్రిగా గుర్తింపు పొందారు.
మాక్రాన్ కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వార్తల నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. మరోవైపు, ఈ ఏడాది చివర్లో జరిగే యూరోపియన్ పార్లమెంటు ఎన్నికలకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చేపట్టిన నూతన ప్రధాని నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications