వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్జీ గేమ్ ఆడొద్దు అంటుంటే ... 14 కోట్ల ప్రైజ్ మనీ పెట్టారు ...ఇంకా ఊరుకుంటారా !

|
Google Oneindia TeluguNews

పబ్జీ .. ఇప్పుడు దేశవ్యాప్తంగా యువత భవిష్యత్ నాశనం చేస్తున్న ఆన్ లైన్ గేమ్ . విద్యార్థులు, యువకుల ప్రాణాలతోనూ, భవిష్యత్ తోనూ చెలగాటమాడుతున్న ఈ ఆట వద్దు ... దీన్ని బ్యాన్ చెయ్యండి మహా ప్రభో అని తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా , ఈ గేమ్ మాత్రం రోజురోజుకీ వ్యసనంలా మారిపోతుంది. ఇక ఈ వ్యసనాన్నిమరింత పెంచటానికి ఈ గేమ్ తయారు చేసిన గేమింగ్ కంపెనీ ఒక ప్రతిష్టాత్మక పోటీని కూడా పెట్టింది. అదేంటో తెలుసా ?

పబ్జీ ఎఫెక్ట్ .. సిద్దిపేటలో మరో యువకుడు బలి పబ్జీ ఎఫెక్ట్ .. సిద్దిపేటలో మరో యువకుడు బలి

 పబ్జీ మొబైల్ క్లబ్ ఓపెన్ 2019.... ఈ గేమింగ్ పోటీ

పబ్జీ మొబైల్ క్లబ్ ఓపెన్ 2019.... ఈ గేమింగ్ పోటీ

ప్రముఖ ఆన్‌లైన్ గేమ్‌ పబ్జీని నిర్వహించే టెన్‌సెంట్ గేమ్స్.. పబ్జీ మొబైల్ క్లబ్ ఓపెన్ 2019ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో ఏడాది పాల్గొనాలి. గెలిచినవారికి 2 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. అంటే మన భారత కరెన్సీలో రూ.14కోట్లు. పబ్జీ మొబైల్ క్లబ్ ఓపెన్ 2019 ఈవెంట్ ఏడాది పాటు జరుగుతుంది. ఇది ఆన్‌లైన్ రంగంలో అతిపెద్ద ఈవెంట్‌గా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనదలచినవారికి మార్చి 8వ తేదీ నుంచి ఎంట్రీకి అవకాశం ఇచ్చారు. మార్చి 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లు ఉంటాయని ప్రకటించింది టెన్ సెట్ కంపెనీ ప్రకటించింది. ఆన్ లైన్ గేమ్ ను ఇంత పెద్ద ప్రైజ్ మనీతో.. ఈవెంట్ నిర్వహించటం ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు.

 ఈ గేమ్ లో విజయం సాధిస్తే అతి పెద్ద క్యాష్ ప్రైజ్ 14 కోట్లు

ఈ గేమ్ లో విజయం సాధిస్తే అతి పెద్ద క్యాష్ ప్రైజ్ 14 కోట్లు

ఈ ఈవెంట్‌లో ప్రో ప్లేయర్లు.. సెమీ ప్రో ప్లేయర్లు పాల్గొనవచ్చునని ప్రకటించారు. ప్రపంచంలోని 10 రీజియన్‌లో ఈ గేమ్ ఆడేందుకు అవకాశం ఉంది. ఏషియన్ మొత్తాన్ని ఓ రీజియన్ గా ఎంపిక చేశారు. మొదటి రిజియన్ వారీగా పోటీలు నిర్వహిస్తారు. వీళ్లందరినీ కలిపి ఓ గేమ్ పెడతారు. అందులో గెలిచిన వారిని విజేతగా ప్రకటిస్తారు. మొత్తం 14 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని విడతల వారీగా.. అందజేస్తారు. ఎంట్రీ లెవల్ నుంచి క్యాష్ ప్రైజ్ లు ఉంటాయి. ఏడాదిపాటు ఈ గేమ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బిగ్గెస్ట్ చికెన్ డిన్నర్ దక్కిన వారు ఈ పోటీలో విజేతలు కానున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్లు గేమ్ అఫిషియల్ వెబ్‌సైట్ www.pubgmobile.com ద్వారా నమోదు చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. ఒక పక్క ఈ గేమ్ ఆడకుండా యువతను కాపాడాలి అని భావిస్తుంటే ఈ ఆటపై మరింత ఆసక్తి పెంచేలా కంపెనీ 14 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటిస్తే ఇక ఈ గేమ్ ఆడకుండా ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి.

టెన్‌సెంట్ గేమ్స్ పెట్టిన ఈ పోటీతో యువతలో మరింత పబ్జీ పిచ్చి

టెన్‌సెంట్ గేమ్స్ పెట్టిన ఈ పోటీతో యువతలో మరింత పబ్జీ పిచ్చి

ఇప్పటికే ఈ గేమ్ మత్తులో యువత ఏం చేస్తున్నామో తెలీనంతగా ప్రవర్తిస్తున్నారు. కొందరు గేమ్ ఆడవద్దు అంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువును పక్కన పెట్టి గేమ్ లో మునిగిపోతున్నారు. ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. అలాంటి ఈ గేమ్ వల్ల యువత భవిత పాడవుతుంటే ఇప్పుడు ఈ గేమింగ్ కంపెనీ పెట్టిన పోటీతో మరింత దారుణంగా పరిస్థితి మారుతుంది అనేది నిర్వివాదాంశం.

English summary
The PUBG Mobile Club Open is an year-long event with a prize pool for $2 million (over Rs 13 crore). The competition would see both pro and semi-pro teams from 10 regions across the globe battling it out for the coveted biggest chicken dinner of them all. It was announced prize money which is roughly Rs. 14 crores, the biggest in any PUBG Mobile event till date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X