ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లిన గాజా

గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
గాజా స్ట్రిప్ నుంచి మంటలు పుట్టించే బెలూన్లు తమ భూభాగంలోకి రావడంతో తాము ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది.
బుధవారం తెల్లవారుజామున పేలుళ్లతో గాజా దద్దరిల్లింది.
మా యుద్ధ విమానాలు ఖాన్ యూనస్, గాజా నగరంలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వెల్లడించింది.
"హమాస్ ప్రాంగణాల్లో తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. గాజా స్ట్రిప్ నుంచి కొనసాగుతున్న తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోడానికి, మళ్లీ యుద్ధం ప్రారంభించడంతోపాటు, అన్నిరకాల పరిస్థితులనూ ఎదుర్కోడానికి ఐడీఎఫ్ సిద్ధంగా ఉంది" అని తాము జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడుల వల్ల ఏదైనా ప్రాణనష్టం జరిగిందా, లేదా అనేది ఇప్పటివరకూ స్పష్టంగా తెలీలేదు.
ఇజ్రాయెల్‌లో ఇటీవల కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇజ్రాయెల్-హమాస్ మధ్య హింసాత్మక ఘర్షణలు జరగడం ఇదే తొలిసారి.
మేలో రెండు పక్షాల మధ్య 11 రోజుల వరకూ భీకర యుద్ధం జరిగింది. తర్వాత మే 21న కాల్పుల విరమణ జరిగింది.
అంతకు ముందు మంగళవారం యూదు జాతీయవాదులు ఇజ్రాయెల్ అధీనంలోని తూర్పు జెరూసలెంలో ఒక ఊరేగింపు నిర్వహించారు. తర్వాత గాజాలో పాలన సాగిస్తున్న మిలిటెంట్ గ్రూప్ హమాస్ నుంచి బెదిరింపులు వచ్చాయి.
- బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు
- ఇజ్రాయెల్-గాజా హింస: కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన జో బైడెన్

మంగళవారం గాజా వైపు నుంచి మంటలు పుట్టించే చాలా బెలూన్లను పంపించారని, దానివల్ల చాలా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని ఇజ్రాయెల్ చెప్పింది.
ఇజ్రాయెల్ ఫైర్ సర్వీస్ వివరాల ప్రకారం దక్షిణ ఇజ్రాయెల్‌లోని కనీసం 20 ప్రాంతాల్లో పొలాల్లో మంటలు చెలరేగాయి.
https://twitter.com/Rushdibbc/status/1404931983004864513
గాజాలోని బీబీసీ ప్రతినిధి రష్దీ అబూ అలఫ్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. తమ ప్రాంతమంతా పైన ఇజ్రాయెల్ డ్రోన్లు తిరుగుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు.
మా హక్కుల రక్షణ కోసం, మా మొత్తం భూభాగం నుంచి ఆక్రమణదారులను బయటకు తరిమికొట్టేవరకూ పాలస్తీనా ప్రతిఘటన కొనసాగుతుంది" అని ట్విటర్లో హమాస్ ప్రతినిధి ఒకరు పెట్టారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్‌లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకుంది... వందేళ్ల ఈ సంక్షోభానికి ముగింపు లేదా?
- ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా మహిళ లైలా ఖాలిద్
- శత్రువు తమపై ప్రయోగించిన మిసైళ్ల శకలాలతోనే రాకెట్లు తయారుచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ కథ
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్‌ప్రెస్ పెర్ల్
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications