షాకింగ్: అబ్బాయిలా వేషం మార్చి 50 మంది టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడి!
లండన్: అబ్బాయిలా వేషం మార్చి టీనేజ్ అమ్మాయిలే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న ఓ యువతిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఊచలు లెక్కపెడుతున్న ఆ యువతికి కోర్టు శనివారం శిక్షను ఖరారు చేయనుంది. కేసు వివరాలు షాకింగ్‌కు గురిచేసేలా ఉన్నాయి.

టీనేజీ అమ్మాయిలే టార్గెట్..
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గెమ్మా వాట్స్ అనే 21ఏళ్ల యువతి తన తన తల్లితో కలిసి ఉత్తర లండన్‌లో నివాసం ఉండేది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే గెమ్మా వాట్సన్.. జేక్ వాటన్ అనే అబ్బాయి పేరుతో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలలో ఖాతాలు తెరిచింది. 14-16ఏళ్ల వయస్సులోని అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని పరిచయాలు పెంచుకుంది.

టోపీ పెట్టుకుని అబ్బాయిలా..
ఆ తర్వాత వారితో చాటింగ్ చేస్తూ.. తన మాటలతో మభ్యపెడుతూ నేరుగా కలిసేందుకు ఒత్తిడి తీసుకొచ్చేది. గెమ్మా తన ఫొటోలనే సోషల్ మీడియాలో పోస్టు చేసేది. అయితే, జుట్టు కనిపించకుండా ఓ పెద్ద టోపీ పెట్టుకునేది. దీంతో గెమ్మా(వాటన్) రూపానికి ఆకర్షితులైన అమ్మాయిలు ఆమె చెప్పినట్లు చేసేవారు.

50మంది అమ్మాయిలపై లైంగిక దాడి..
లైంగికపరమైన వ్యాఖ్యలు చేస్తూ అలాంటి శృంగారానికి సంబంధించిన ఫొటోలను అమ్మాయిలతో పంచుకునేది. మరికొందరిని నేరుగా కలిసి వారిపై లైంగికంగా దాడి చేసింది గెమ్మా. ఇలా ఇంగ్లాండ్ వ్యాప్తంగా సుమారు 50 మందికిపైగా అమ్మాయిలను ఆమె లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు తేల్చారు.

ఓ డాక్టర్ ఫిర్యాదుతో..
ఓ డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో 2018లో గెమ్మాను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ అమ్మాయితో ఉండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలతోపాటు ఓ బాలుడిపై కూడా గెమ్మా లైంగిక దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, గెమ్మా గతంలో మంచి ఫుడ్ బాల్ ప్లేయర్ అని, ఎందుకిలా మారిందో తెలియడం లేదని పోలీసులు తెలిపారు.

నలుగురిపైనే లైంగిక దాడి చేశానంటూ..
అయితే, ఈ దారుణాలకు పాల్పడినందుకు గెమ్మా ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసేంత వరకు కూడా గెమ్మా.. అమ్మాయి అనే విషయం ఆమె బాధితులకు ఎవరికీ కూడా తెలియదని చెప్పారు. గెమ్మా మాత్రం తాను నలుగురు అమ్మాయిలపై మాత్రమే లైంగిక దాడికి పాల్పడినట్లు చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కోర్టులో నిందితురాలిని ప్రవేశపెట్టడంతో విచారించిన కోర్టు.. శనివారం ఆమెకు శిక్షను ఖరారు చేయనుంది.












Click it and Unblock the Notifications