జార్జ్ యువర్ గ్రేట్: ప్రపంచాన్నే మార్చావు, కూతురు భావోద్వేగ వీడియో, నెటిజన్ల ఫిదా..
అమెరికా పోలీసు చేతిలో హత్యకు గురైన జార్జ్ ఫ్లాయిడ్ కూతురు గియానా ఫ్లాయిడ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె నాన్న ప్రపంచాన్ని మార్చాడు అని చెబుతోన్న మాటలు వింటుంటే ప్రతీ ఒక్కరి కంటి నుంచి నీరు వస్తోంది. ఈ వీడియోను జార్జ్ స్నేహితుడు స్టీఫెన్ జాక్సన్ పోస్ట్ చేశారు. చిన్నారి వీడియో చూసిన నెటిజన్లు.. జాత్యాంహకార హత్యపై తమ గళం వినిపించారు.
ఇటీవల జార్జ్ ప్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికాలో హత్యకు గురయ్యాడు. దీనిని నిరసిస్తూ స్టీఫెన్.. తన భుజాలపై గియానాను కూర్చొబెట్టుకొని వీడియో చేశాడు. నాన్న ఏం చేశాడు అని చిన్నారిని అడగగా... ప్రపంచాన్నే మార్చివేశాడు అని చిన్నారి చెప్పింది. రైట్ గియానా.. జార్జ్ ప్లాయిడ్ ది నేమ్ ఆఫ్ ఛేంజ్ అంటూ వీడియో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో రాశాడు. ఆ వీడియో తెగ వైరలవుతోంది. ఆ చిన్నారి తండ్రి కోసం ఒక కన్నీటి బొట్టును రాల్చండి అంటూ రాస్తున్నారు. మరొకరు జాత్యాంహకార హత్యలు సరికాదు అని కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల మిన్నే పోలీస్ పట్టణంలో జార్జ్ ఫ్లాయిడ్ మెడపై పోలీసు కాలితో తొక్కాడు. ఊపిరి ఆడటం లేదు అని చెప్పినా వినిపించుకోలేదు. అలా 7 నిమిషాలు జార్జ్ గొంతును మోకాలితో తొక్కడంతో జార్జ్ చనిపోయాడు. జార్జ్ హత్యను నిరసిస్తూ అమెరికా అట్టుడికిపోతోంది. హ్యాండ్స్ అప్, డోంట్ షూట్, నో జస్టిస్, నో పీస్ అంటూ హ్యుస్టన్ వీధుల్లో ర్యాలీలు తీస్తున్నారు. వైట్ హౌస్ వద్ద కూడా ఆందోళన చేయడంతో.. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ బంకర్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications