బిడ్డ కోసం ప్రాణాలకు తెగించిన తండ్రి (వీడియో)
జార్జియా: కుమారుడిని రక్షించుకోవడానికి ఒక తండ్రి ప్రాణాలకు తెగించాడు. కారును పట్టుకుని రోడ్డు మీద పరుగు తీసి చివరికి తన కుమారుడిని దొంగ బారి నుండి రక్షించుకున్నాడు. జార్జియాలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
జార్జియాలో మాల్కోమ్ మిల్లోన్స్ అనే వ్యక్తి భార్య, 8 సంవత్సరాల కుమారుడితో కలిసి జాతీయ రహదారిలోని గ్యాస్ బంక్ (పెట్రోల్ బంక్) దగ్గరకు వెళ్లాడు. తరువాత కారుకు గ్యాస్ పట్టించాడు. అదే సమయంలో అతని భార్య గ్యాస్ కు డబ్బులు చెల్లించడానికి వెళ్లారు.
కారు వెనుక సీటులో కుమారుడు మాత్రం ఉన్నాడు. ఆ సందర్బంలో ఒక దొంగ టక్కున కారులోకి ఎక్కాడు. తరువాత కారు స్టార్ట్ చేశాడు. విషయం గుర్తించిన మాల్కోమ్ మిల్లోన్స్ ఒక్క సారిగా కారు మీదకు జంప్ చేశాడు. కారు పైన ఏర్పాటు చేసిన లగేజ్ సేఫ్టీ రాడ్ పట్టుకున్నాడు.
అయితే దొంగ మాత్రం కారు నిలపలేదు. సుమారు 300 మీటర్ల దూరం అలాగే వెళ్లాడు. తరువాత మాల్కోమ్ మిల్లన్ తన కుడి చేతితో కారు అద్దం పగలగొట్టి దొంగను పట్టుకున్నాడు. కారు సమీపంలోని చెట్టును డీకొనింది. తరువాత దొంగను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించాడు. తనకు కారు కంటే తన కుమారుడి ప్రాణాలు ముఖ్యమని మాల్కోమ్ మిల్లోన్స్ అంటున్నాడు.












Click it and Unblock the Notifications