జర్మన్ వింగ్స్: ప్రయాణీకుల ఆర్తనాదాలు, కోపైలట్ గర్ల్‌ఫ్రెండ్ ప్రెగ్నెంట్!

ప్యారిస్: జర్మన్ వింగ్స్ విమానంలో కాక్ పిట్ వాయిస్ రికార్డ్‌లోని సమాచారం ఆధారంగా జర్మన్ పత్రిక బిల్డ్ మరో కథనాన్ని ఆదివారం నాడు ప్రచురించింది. కో పైలట్ ఆండ్రియాజ్ ల్యూబిడ్జ్ కావాలనే ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని ఆల్ఫ్స్ పర్వతాలకు ఢీకొట్టి ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కో పైలట్ ల్యూబిడ్జ్‌కు, పైలట్‌కు మధ్య జరిగిన సంభాషణను జర్మన్ పత్రిక ప్రుచురించింది. తలుపు తీయాలంటూ కెప్టెన్ బిగ్గరగా అరిచారని, దీనితో పాటు ప్రయాణీకులు ఆర్తనాదాలు చేశారని, ఇవి కాక్ పిట్ వాయిస్ రికార్డులో నమోదయ్యాయని బిల్డ్ తెలిపింది.

German newspaper releases timeline of Germanwings flight before crash

విమానం మరో ఎనిమిది నిమిషాల్లో కూలిపోతుందనే సమయంలో కాక్ పిట్ తలుపు తీయాలంటూ కెప్టెన్ గట్టిగా అరిచారని, బాత్ రూంకి వెళ్లి వచ్చిన అనంతరం కెప్టెన్ తలుపుతీసే ప్రయత్నం చేసినట్లుగా పేర్కొంది. గొడ్డలితో తలుపును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడని తెలిపింది.

బార్సిలోనా నుండి విమానం బయలుదేరిన సమయంలో కెప్టెన్‌కు బాత్ రూంకు వెళ్లడానికి సమయం లేదని, ఈ విషయాన్ని కాక్ పిట్ నుండి బయటకు వెళ్లేముందు కో పైలట్‌కు సదరు కెప్టెన్ వివరించాడని పేర్కొంది. ఇదిలా ఉండగా, ల్యూబిడ్జ్ మాజీ ప్రియురాలు గర్భవతి అని ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+