నైట్ క్లబ్‌లో కాల్పులు, ఇద్దరు మృతి

జర్మనీలోని కాన్‌‌స్టాంజ్‌ నగరంలోని నైట్ క్లబ్‌లో కాల్పులు కలకలం రేగింది. కాన్ స్టాంజ్ నగరంలోని గ్రే నైట్‌ క్లబ్‌‌లో ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

బెర్లిన్: జర్మనీలోని కాన్‌‌స్టాంజ్‌ నగరంలోని నైట్ క్లబ్‌లో కాల్పులు కలకలం రేగింది. కాన్ స్టాంజ్ నగరంలోని గ్రే నైట్‌ క్లబ్‌‌లో ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

దీంతో క్లబ్‌లో ఉత్సాహంగా గడుపుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కాల్పుల సమాచారం అందండంతో వేగంగా స్పందించిన పోలీసులు హుటాహుటీన క్లబ్‌ను చుట్టుముట్టారు. క్షణాల్లో చుట్టుముట్టడంతో పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు దుండగుడు ప్రయత్నించగా, అతనిని వారు కాల్చారు.

German nightclub shooting: Two dead in Constance

దీంతో తీవ్రగాయాలపాలైన దుండగుడి సహా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

అయితే అతను ఎందుకు కాల్పులకు తెగబడాల్సి వచ్చింది? అతను ఉగ్రవాదా? సాధారణ పౌరుడా? వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంది. అయితే కాల్పుల నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతమంతా గాలింపు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+