రేప్‌లు: ఇంటర్న్‌షిప్‌కు ప్రొఫెసర్ నో, భారత్ రేపిస్ట్ దేశం కాదని ఆగ్రహం
జర్మనీ: భారత్‌లో అత్యాచారాల సమస్య ఉందంటూ ఓ జర్మన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఒకరు పెట్టిన ఈ మెయిల్ పైన విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే, రాయబారి ఆగ్రహంతో సదరు ప్రొఫెసర్ క్షమాపణ కోరారు. భారత దేశానికి చెందిన ఓ పురుష విద్యార్థికి ఇంటర్న్‌షిప్ ఇచ్చేందుకు ప్రొఫెసర్ నిరాకరించారు. ఇందుకు సంబంధించి మెయిల్ పెట్టారు. ఆమె మహిళా ప్రొఫెసర్. ఆమె భారత విద్యార్థికి ఈ మెయిల్ పంపించారు.
లైఫ్ జిగ్ విశ్వవిద్యాలయంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోకెమిస్ట్రీలో ఇంటర్న్‌షిప్ కోసం సదరు భారత విద్యార్థి ప్రయత్నించాడు. అక్కడి ప్రొఫెసర్ బెక్ సికింగర్ ఇందుకు నిరాకరించారు. భారత్‌కు చెందిన పురుష విద్యార్థులకు అవకాశమివ్వలేమని మెయిల్‌లో స్పష్టం చేశారు.

భారత మగ విద్యార్థులెవరినీ ఇంటర్న్‌షిప్‌కు తాను అనుమతించలేనని ఆమె చెప్పారు. ఆ దేశంలో అత్యాచార సమస్య గురించి చాలా వార్తలు వింటున్నామని, తన బృందంలో అనేకమంది విద్యార్థినులు ఉన్నారని మెయిల్‌లో పేర్కొన్నారు. భారత్‌లో అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. మహిళల పట్ల ఒక సమాజ దృక్కోణాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయన్నారు.
తానే కాదని ఇతర మహిళా ప్రొఫెసర్లు కూడా భారత్‌కు చెందినపురుష విద్యార్థులను చేర్చుకోవడం లేదని, ఐరాపాకు చెందిన ఇతర మహిళా సంఘాలు తమతో చేతులు కలుపుతున్నాయని చెప్పారు. ఈ విషయం భారత్‌లోని జర్మనీ రాయబారి మైఖేల్ స్టైనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ లేఖ రాశారు. చట్టానికి కట్టుబడే, కష్టపడే తత్వమున్న కోట్లమంది భారతీయుల గురించి అలా భావించడం సరికాదన్నారు. భారత్ రేపిస్టుల దేశం కాదన్నారు. దీంతో ఆమె వెనక్కి తగ్గారు. క్షమాపణ చెప్పారు. తాను తప్పు చేశానని, నా వైఖరి వల్ల నొచ్చుకున్న వారికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications