రేప్ చేసి, అమ్మాయితో వీడియో తీయించారు, బయటపడేశారు
హాంబర్గ్: దేశంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆశ్రయం పొందేందుకు జర్మనీకి వెళ్లిన సెర్బియా శరణార్థులు దారుణానికి పాల్పడ్డారు. సెర్బియా అల్లరి మూక జర్ననీకి చెందిన 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని పైన సామూహిక అత్యాచారానికి పాల్పడింది.
ఈ దృశ్యాలను సెర్బియాకు చెందిన మరో బాలిక చేతి వీడియో తీయించారు. అనంతరం నగ్నంగా దీనస్థితిలో ఉన్న అమ్మాయిని ఎముకలు కొరికే చలిలో బయటకు విసిరేశారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగింది.

సెర్బియాకు చెందిన పదిహేనేళ్ల బాలిక... జర్మనీ అమ్మాయిని ఇంటికి వెనుక వైపుకు తీసుకెళ్లి తమ గ్యాంగుకు అప్పగించింది. అక్కడ సెర్బియా యువకులు బలవంతంగా జర్మనీ అమ్మాయితో మద్యం తాగించారు. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను మరో బాలికతో వీడియో తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications