'ఆమె కామం 8మంది పిల్లలను బలితీసుకుంది..'

Subscribe to Oneindia Telugu

బెర్లిన్ : కడుపు తీపి ఉన్న ఏ తల్లి తన బిడ్డలను చేజేతులా చంపుకోదు. కానీ పిల్లల కంటే కామమే ముఖ్యమనుకున్న ఓ తల్లి ఏకంగా తన 8 మంది పిల్లలను పొట్టన బెట్టుకుంది. పిల్లలు వద్దనుకున్నప్పుడు.. గర్బ నిరోధక ప్రయత్నాలు చేయాల్సింది పోయి, తరుచూ గర్బం దాల్చడం.. పుట్టిన పిల్లలందరినీ చంపడమే పనిగా పెట్టుకుంది.

జర్మనీలోని బెర్లిన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడి ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆండ్రియా (45), జోహాన్‌ (54) దంపతులకు పెళ్లయిన తొలి మూడేళ్లలో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత పిల్లలు వద్దనుకున్నారు గానీ గర్బం రాకుండా జాగ్రత్త పడలేదు. దీంతో గత పదేళ్ల కాలంలో ఆండ్రియా ఎనిమిది సార్లు గర్బం దాల్చింది.

అయితే.. ఆండ్రియా తరుచూ గర్బంతోనే కనిపిస్తున్నా.. పుట్టిన పిల్లలు అలికిడి మాత్రం లేకపోవడం చుట్టుపక్కల వాళ్లకు అనుమానం రేకెత్తించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ కోసం అడుగుపెట్టిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి.

German woman convicted after 8 babies' bodies found in home

ప్రసవం అయినా ప్రతీసారి పురిట్లోనే చంటిబిడ్డలను చంపేయడం అలవాటుగా మార్చుకుంది ఆండ్రియా. పసిబిడ్డలను టవల్ లో చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసేది. అలా మొత్తం 8 మంది పసిబిడ్డలకు జన్మనిచ్చి, అనంతరం వారిని చంపేసిన ఆండ్రియా.. చిన్నారుల మృతదేహాలను మాత్రం ఇంట్లోనే భద్రపరుచుకుంది.

కేసును తీవ్రంగా పరిగణించిన అక్కడి న్యాయస్థానం ఆండ్రియాకు 14 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కేసులో ఆండ్రియా భర్త జోహాన్ ను మాత్రం నిర్దోషిగా కోర్టు పరిగణించడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 45-year-old German woman has been found guilty of manslaughter in the death of four of her newborn babies whose bodies were found at her apartment in a Bavarian town.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి