జర్మన్ వింగ్స్: ఆ బ్లాక్‌బాక్స్ దొరకకపోవచ్చు, కీలక సమాచారం గల్లంతేనా?
ప్యారిస్: వారం రోజుల క్రితం ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిన జర్మన్ వింగ్స్ ఎయిర్‌బస్ ఏ320 రెండో బ్లాక్ బాక్స్ లభించకపోవచ్చునని అంటున్నారు. మొదటి బ్లాక్ బాక్స్ దొరికింది. అందులోని వాయిస్ రికార్డ్‌ను కూడా పరిశీలించారు.
అయితే, రెండో బ్లాక్ బాక్స్ దొరికితేనే ఏం జరిగిందనే పూర్తి సమాచారం లభించవచ్చునని అంటున్నారు. ఆ రెండో బ్లాక్ బాక్స్ లభించకుంటే ప్రమాదానికి గల కీలక ఆధారం లభించకపోవచ్చునని చెబుతున్నారు.
విమాన ప్రమాదం నేపథ్యంలో ఎక్కువ స్థాయిలో నష్టం జరిగిందని, అఆందుకే ఫ్లైట్ డేటా రికార్డర్ ఏ ప్రమాద సూచనలు పంపించలేదని లుఫ్తాన్సా మేనేజర్ కే క్రాక్తీ స్థానిక మీడియాతో చెప్పారు.

కాక్ పిట్‌లోని వాయిస్ రికార్డర్ లేదా తొలి బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత డేటా రికార్డర్ లేదా సెకండ్ బ్లాక్ బాక్స్ కోసం సెర్చ్ ఆపరేషన్ వారు వెతికారని, కానీ అది దొరకలేదని చెప్పారు. వాయిస్ రికార్డర్ లేదా తొలి బ్లాక్ బాక్స్ ద్వారా ఆడియో వినిపించిన విషయం తెలిసిందే.
విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ చాలా కీలకమైనవి. అందులో ఒకటే లభించింది. మరొకటి లభించవలసి ఉంది. రెండోది దొరికితేనే అసలు ఏం జరిగిందనే విషయం తెలియవచ్చునని అంటున్నారు. డేటా రికార్డర్ లేదా సెకండ్ బ్లాక్ బాక్స్‌లో విమానానికి సంబంధించి ఏం జరిగిందనేది పూర్తిగా ఉంటుంది. ప్రతి సెకండ్ ఏం జరిగిందనేది అందులో రికార్డై ఉంటుంది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications