వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరం కాదు: యాంకర్‌తో పెళ్లిపై ఇమ్రాన్, మాజీ భార్య ఆశీస్సులకోసం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాహోర్: పెళ్లి చేసుకోవడం ఏం నేరం కాదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అన్నారు. బీబీసీ వెదర్ గర్ల్ రెహామ్ ఖాన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. ఆ విషయాన్ని తన మొదటి భార్యకు చెప్పడం, అది బయటకు రావడం తెలిసిందే.

ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయంపై విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దానిపై పైవిధంగా స్పందించారు. మరోవైపు, బ్రిటిష్ సోషలైట్ అయిన ఇమ్రాన్ మొదటి భార్య కూడా ఆయనకు అండగా నిలిచారు! ఇమ్రాన్ పెళ్లి జీవితం సంతోషంగా ఉండాలని ట్వీట్ చేశారు.

గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ప్రజలు తనకు మద్దతుగా ఎన్నో సందేశాలు పంపించారని, అవి తనను టచ్ చేశాయని ట్వీట్ చేశారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ తన రెండో భార్య రెహామ్ ఖాన్‌తో కలిసి యూకేకు వెళ్తున్నారు. తన మొదటి భార్యను ఆయన కలవనున్నారు.

Getting Married is Not a Crime: Imran Khan on Storm Over Secret Wedding, Finds Support From Ex-Wife

కాగా, ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ఖాన్ తన రెండో వివాహానికి గల కారణాలను వెల్లడించారు. మాజీ భార్య జమిమా గోల్డ్‌స్మిత్‌ను కలిసి తన రెండో పెళ్లికి కారణాలను తెలిపారు.

62 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ తన కన్నా 20 ఏళ్లు చిన్నదైన రెహమ్ ఖాన్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. రెహమ్‌ఖాన్‌కు కూడా ఇది రెండో పెళ్లే. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ఈ రహస్య వివాహం గురించి మొదట ప్రపంచానికి వెల్లడించింది జమిమానే.

English summary
Getting Married is Not a Crime: Imran Khan on Storm Over Secret Wedding, Finds Support From Ex-Wife
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X