వీడియో వైరల్ : లిఫ్టులో ఇరుక్కున్న తమ్ముడు... అక్క ఎలా కాపాడిందో చూడండి..!

ఇస్తాంబుల్ : సృష్టిలో అక్క తమ్ముడికి ఉన్న అనుబంధం వర్ణించలేనిది. అక్కను తమ్ముడు కాపాడుకుంటే... తమ్ముడికి ఏదైనా ప్రమాదం జరిగితే అక్క తన ప్రతాపం చూపుతుంది. తాజాగా సోషల్ మీడియాను ఓ అక్కా తమ్ముడి వీడియో కుదిపేస్తోంది. అయితే ఇక్కడ అదేదో 20 ఏళ్ల వయస్సు కాదు తమ్ముడికి 15 ఏళ్ల వయసు కాదు. ఇద్దరూ చిన్నారులే. తమ్ముడికి ప్రమాదం పొంచి ఉందని భావించిన అక్క తమ్ముడిని కాపాడుకుంది. అదెలాగో మీరు కూడా చూడండి.

sister brother

టర్కీలోని బసక్‌షేర్ జిల్లాలో ఓ చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్‌లోకి తనతో పాటు మరొక అబ్బాయి వెళ్లారు. అప్పటికే లిఫ్ట్‌లో అక్క ఉంది. లిఫ్ట్‌లోకి తనతో పాటు ఓ తాడును అబ్బాయి తీసుకొచ్చాడు. లిఫ్ట్ డోర్లు మూసుకున్నాయి. అయితే తాడు మాత్రం రెండు డోర్ల మధ్య ఇరుకుప్పోయింది. ఇక లిఫ్ట్ కిందకు వెళుతున్న సమయంలో తాడు ఆ చిన్నారి మెడకు చుట్టుకుంది. వెంటనే తాడుతో పాటు ఆ చిన్నారి కూడా గాల్లోకి లేచాడు. తాడు మెడకు చుట్టుకోవడంతో అబ్బాయి కాసేపు ప్రాణాల కోసం తనకలాడాడు.

లిఫ్టులోనే ఉన్న ఆ అక్క తమ్ముడిని గాల్లో వ్రేలాడటం చూసి చురుగ్గా వ్యవహరించింది. చిన్నారి కాళ్లను పట్టుకుంది. తద్వారా మెడకు చుటుకున్న తాడు వదులైంది. అంతేకాదు లిఫ్టులోని ఎమర్జెన్సీ బటన్ కూడా నొక్కింది. ఇక వెంట్రుకవాసిలో తన తమ్ముడు ప్రాణాలతో బయటపడ్డాడు. లిఫ్టులో ఉన్న సీసీ కెమరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజెన్లు అక్కకు తట్టిన చురుకైన ఆలోచనను తమ్ముడిని కాపాడిన విధానంను ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+