ఏడేళ్ల బాలికల్లో ఇలాంటి ఆలోచనలా! ఎందుకింతలా..?

లండన్ : టీనేజీ దాటి యుక్త వయసులోకి అడుగుపెట్టాక గానీ సాధారణంగా అందం మీద అంతగా ధ్యాస ఉండదు. కానీ నేటితరం అలా కాదు. నిండా పదేళ్లు కూడా నిండకుండానే.. అందంగా ఉండాలని తపించిపోతూ విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా బ్రిటన్ లో నిర్వహించిన ఓ సర్వేలో ఇదే విషయం తేటతెల్లమైంది.

ఏడేళ్ల బాలికలు సైతం అందం పట్ల విపరీతమైన శ్రద్ద కనబరుస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లుగా సర్వే వెల్లడించింది. అందంగా లేకపోతే సమాజం తమను గుర్తించదు, తమకు అండగా నిలబడదు అన్న అపోహల్లో ఏడేళ్ల నుంచి పదేళ్ల బాలికలు కూరుకుపోయినట్లుగా సర్వే తెలిపింది. ప్రతిభ కన్నా నేటి సమాజం అందాన్నే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుందన్న నమ్మకం వారిలో ఏర్పడినట్లు వెల్లడైంది.

Girls as young as 7 feel pressure to be pretty body confidence study

గాళ్ గైడింగ్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సర్వే నిర్వహించగా.. చాలామంది బాలికలు తమను అందం కన్నా ప్రతిభ ఆధారంగానే గుర్తించాలని కోరడం గమనార్హం. ఈ విషయాన్ని సంస్థ డైరెక్టర్ బెకీ హెవిట్ వెల్లడించారు. ఏడేళ్ళ వయసు బాలికల నుంచి 21 ఏళ్ళ వయసు యువతుల వరకు అందంపై వారి వారి అభిప్రాయాలను సేకరించింది సంస్థ. ఇకపోతే సర్వేల వెల్లడైన వివరాలను గణంకాల పరంగా పరిశీలిస్తే.. శరీర సౌందర్యమే అన్నింటికన్నా ప్రాధాన్యత ఉన్న విషయం అనిపించేలా సమాజం ప్రవర్తన ఉందని 36 శాతం మంది ఆడవాళ్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో తాము మరింత పరిణతి చెందాల్సిందిగా, మరింత ఖచ్చితత్వంతో వ్యవహరించాల్సిందిగా 26శాతం మంది ఆడవాళ్లు చెప్పారు. అందంగా లేనందుకు బాధపడుతున్నామని, అది తమకు అవమానకరంగా ఉందని 15 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఉండాల్సినంత అందంగా లేమని 38 శాతం మంది తెలిపారు. దీన్నిబట్టి చూస్తే.. బ్రిటన్ సొసైటీలో బాల్యాన్ని సైతం ప్రభావితం చేసేలా బ్యూటీ కాన్షియస్ వారిలో ఎంతగా బలపడిందో వారిని ఎంత అభద్రతకు గురిచేస్తుందో అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+