ముద్దు పెట్టుకోండి..లేదా: బస్సులో అమ్మాయిలపై ఆకతాయిల వేధింపులు

లండన్: ఏ దేశమేగినా.. ఎక్కడ కాలిడినా.. మహిళలపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గడం లేదు. ప్రతి చోటా మహిళను అదేపనిగా కాటేసే కామ మృగాలు సంచరిస్తున్నాయి. అంతేకాదు కొందరైతే ఉన్మాదంతో మహిళలపై దాడి కూడా చేస్తున్నారు. తాజాగా లండన్‌లో నలుగురు ఈవ్ టీజర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అదికూడా బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరు యువతులను తమ సరదాకోసం అల్లరి పెట్టి ఆ తర్వాత దాడి చేయడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.

 ముద్దు పెట్టుకుంటారా లేదా..?

ముద్దు పెట్టుకుంటారా లేదా..?

లండన్ బస్సులో ఓ వారం క్రితం ప్రయాణించారు 28 ఏళ్ల మెలానియా గేమోనాట్ మరియు ఆమె స్నేహితురాలు క్రిస్. వారు బస్సు ఎక్కినప్పటి నుంచే కొందరు ఆకతాయిలు వారిని అల్లరి పెట్టడం మొదలు పెట్టారు. ఈ మూకలు వారి సరదా తీర్చుకునేందుకు ముద్దు పెట్టుకోవాల్సిందిగా గదమాయించారు. ఇందుకు వారు ఒప్పుకోలేదు. ఒకరి నొకరు ముద్దు పెట్టుకుంటే వారిని లెస్బియన్స్‌గా చిత్రీకరించి ఆనందం పొందాలనుకున్నారని బాధితురాలు వెల్లడించింది. అంతేకాదు లైంగికంగా కూడా దాడి చేశారని బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బస్సులో ఆ ఆకతాయిలు, తాము మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు వారిపై కొన్ని కాయిన్లు కూడా విసిరినట్లు బాధిత యువతులు ఫిర్యాదు చేశారు.

ఇద్దరి యువతులపై పిడిగుద్దులు

ఇద్దరి యువతులపై పిడిగుద్దులు

ఇక కాసేపు తర్వాత క్రిస్ పై ఆకతాయిలు దాడి చేసినట్లు మెలానియా తెలిపింది. రక్తమోడుతూ తీవ్ర బాధతో క్రిస్ కనిపించిందని మెలానియా పేర్కొంది. అంతేకాదు ముగ్గురు కలిసి ఆమెను చితకబాదారని చెప్పిన మెలానియా ఆ తర్వాత తనను కూడా కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఇద్దరినీ ఇతరులు హాస్పిటల్‌కు చికిత్సకోసం తరలించారు. ఈ ఘటన మే 30 తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పారు. లండన్ బస్సులో వారిపై కొందరు యువకులు వేధించడంతో పాటు దాడి చేశారని తెలిపారు. అంతేకాదు వారిపై దాడి చేసిన తర్వాత అందరూ అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు. వెళుతూ వెళుతూ యువతుల దగ్గరున్న డబ్బు, మొబైల్ ఫోన్లను దోచుకెళ్లారని పోలీసులు చెప్పారు. ఆకతాయిల్లో ఒకరు స్పానిష్ మాట్లాడినట్లు యువతులు చెప్పారు. మిగతా ముగ్గురు బ్రిటన్ యాక్సెంట్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు.

 దాడిని ఖండించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే

దాడిని ఖండించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే

దాడిపై స్పందించారు బ్రిటన్ ప్రధాని థెరిసా మే. యువతులపై దాడిని ఆమె ఖండించారు. డిటెక్టివ్ సూపరింటెండెంట్ ఆండీ కాక్స్. అమ్మాయిలపై దాడి చేయడం దారుణమని అన్నారు. దాడిని ఆయన ఖండించారు. విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సాధారణంగా లండన్ బస్సుల్లో ఇలా మహిళలను వేధించే ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని ప్రముఖ పత్రికలు కథనాలు రాసుకొచ్చాయి. ఇదిలా ఉంటే గేమోనాట్ ఉరుగ్వేకు చెందగా ఆమె స్నేహితురాలు క్రిస్ అమెరికాకు చెందినది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+