ప్రపంచానికి పెను ప్రమాదం!: వ్యాపిస్తోన్న 60 ఏళ్ల నాటి డేంజరస్ వైరస్!!

ప్రపంచాన్ని భయంకరమైన వైరస్‌లు వణికిస్తూనే ఉన్నాయి. ఒక వైరస్ నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్న వెంటనే మరో వైరస్ వ్యాప్తి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు ఆఫ్రికా దేశమైన ఎథియోపియాలో 60 ఏళ్ల నాటి భయంకరమైన మార్‌బర్గ్ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణ ఎథియోపియాలో 9 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ప్రకటించింది. మార్‌బర్గ్ వైరస్ అనేది తీవ్రమైన, ప్రాణాంతకమైన వైరల్ రక్తస్రావ జ్వరం. ఇది ఎబోలా వైరస్‌తో సమానమైన ఫైలోవైరస్ కుటుంబానికి చెందుతుంది.

మార్‌బర్గ్‌ వైరస్ లక్షణాలు, వ్యాప్తి
ఎబోలా మాదిరిగానే మార్‌బర్గ్‌ వైరస్ ప్రధానంగా జంతువుల నుంచి మానవులకు ఆపై ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, లాలాజలం, మూత్రం, ఇతర శారీరక ద్రవాలు లేదా కలుషితమైన ఉపరితలాలను నేరుగా తాకడం ద్వారా వ్యాపిస్తుంది. ప్రారంభ లక్షణాలు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, చలి, కండరాల నొప్పిగా ఉంటాయి. కొంతమందికి ఛాతీ నొప్పి, వికారం, వాంతులు,అతిసారం కూడా సంభవించవచ్చు. వ్యాధి తీవ్రమైన సందర్భాలలో పెద్ద మొత్తంలో రక్తస్రావం జరగడం, అనేక అవయవాలు పనిచేయడం ఆగిపోవడం సంభవించవచ్చు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన రోగులలో మరణాలు సాధారణంగా 8 నుంచి 9 రోజులలో సంభవించవచ్చు. ఈ వ్యాధికి మరణాల రేటు దాదాపు 50 శాతం వరకు ఉంది.

Global Alert Deadly 60-Year-Old Marburg Virus Resurges in Ethiopia

వైరస్ చరిత్ర, చర్యలు
పేరు ఎలా వచ్చింది?: మార్‌బర్గ్‌ వైరస్‌ను మొట్టమొదటగా 1967లో జర్మనీలోని మార్‌బర్గ్‌ నగరంలో గుర్తించారు. ప్రయోగశాలలో పనిచేసే కొంతమందికి అజ్ఞాత వైరస్ కారణంగా అనారోగ్యం రావడంతో ఈ వైరస్‌ను ఆ నగరం పేరు మీద నామకరణం చేశారు. ఈ వైరస్ మొదట గబ్బిలాల ద్వారా మానవులకు వ్యాపించిందని భావిస్తున్నారు. ఒకసారి వ్యాప్తి మొదలైన తర్వాత, ఇది మనుషుల నుంచి మనుషులకు సులభంగా సోకుతుంది.

ఈ వైరస్‌ను అరికట్టడానికి, సోకిన వారికి చికిత్స అందించడానికి ఎథియోపియాకు అన్ని విధాలా మద్దతు ఇస్తున్నామని, అలాగే సరిహద్దుల మీదుగా ఇది వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. ప్రస్తుతం ఈ మార్‌బర్గ్‌ వైరస్‌కు వ్యతిరేకంగా ఎటువంటి టీకా లేదా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు. రోగులకు కేవలం సహాయక సంరక్షణ మాత్రమే అందించబడుతుంది. గతంలో అంగోలా, కాంగో, ఘనా, కెన్యా, టాంజానియా, ఉగాండా వంటి అనేక ఆఫ్రికా దేశాలలో కూడా ఈ వైరస్ వ్యాప్తి నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+