పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన గోఎయిర్ విమానం...
గోఎయిర్‌కి చెందిన రియాధ్-ఢిల్లీ విమానం మంగళవారం అత్యవసర పరిస్థితుల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో ఓ వ్యక్తికి(30) హఠాత్తుగా గుండెపోటు రావడంతో విమానాన్ని పైలట్ కరాచీలోని జిన్నా విమానాశ్రయం వైపు మళ్లించాడు. అక్కడి విమానాశ్రయంలో గోఎయిర్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అయితే గుండెపోటుకి గురైన వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది.
దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రియాధ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన గోఎయిర్ G8-6658A విమానం మెడికల్ ఎమర్జెన్సీతో కరాచీలో ల్యాండ్ అయినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ విమానం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు తెలిపింది.

GoAir Riyadh-Delhi flight diverted to Karachi airport due to a medical emergency onboard (passenger reported unwell). The flight landed safely at Karachi airport: Airline Official
— ANI (@ANI) November 17, 2020
More details awaited. pic.twitter.com/0MV47qzRM6
Recommended Video
గతంలోనూ విమానాలు ఇలా అత్యవసరంగా ల్యాండ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రెండేళ్ల క్రితం పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానం జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం తలుపు తెరుచుకున్నట్లు గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరాడు. ల్యాండ్ అయిన విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం విమానం తిరిగి పాక్ పయనమైంది.
-
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications