కదులుతున్న బస్సులో... స్టీరింగ్ విడిచి చిందేశాడు(వీడియో)

ఇస్తాంబుల్: అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారిలో నడుస్తున్న బస్సులో స్టీరింగును వదిలిపెట్టి చిందులు వేశాడు ఆ బస్సు డ్రైవర్. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన టర్కీలోని ఇస్తాంబుల్‌లో చోటు చేసుకుంది.

కాగా, ఈ వ్యవహారాన్ని వీడియో తీసిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. వీడియోను గుర్తించిన టర్కీ పోలీసులు ఆ డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేసి, జరిమానా విధించారు.

Going viral: Driver caught on camera dancing to a folk song in moving bus

ఆ వీడియోలో బస్సు డ్రైవర్ మెటిన్ కాండెమిర్ తన సీట్లోంచి లేచి వచ్చి ప్రయాణికులతోపాటు చిందులు వేశాడు. అప్పటి వరకు పాటలకు ఈలలు వేసుకుంటూ డ్యాన్సులు చేసిన ప్రయాణికులు.. డ్రైవర్ స్టీరింగును విడిచి రావడంతో ఆందోళనకు గురయ్యాడు. అయితే ప్రమాదమేమి జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కాసేపు చిందులు వేసిన డ్రైవర్ మళ్లీ తన సీట్లో కూర్చున్నాడు. అయితే బాధ్యతా రహితంగా వ్యవహరించిన అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 80 డాలర్ల జరిమానా విధించారు. కాగా, పదేళ్లుగా ఆ మినీ బస్సుకు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న కాండెమిర్ ఈ ఘటన పట్ల క్షమాపణలు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+